Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ స్టామినా.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సర్కారు వారి పాట

|

May 13, 2022 | 8:26 PM

నమ్రత మ్యామ్‌.. సార్‌కు దిష్టి తీయండి! ఇది ప్రిన్స్ క్లాసిక్ ఫ్యాన్స్ స్వీట్ రిక్వెస్ట్. బాబులకే బాబు మా మహేష్ బాబు.. రికార్డులు బద్దలైపోయాయన్న..! ఇది ప్రిన్స్ మాస్‌ ఫ్యాన్స్ మాసీ డైలాగ్‌.

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ స్టామినా.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సర్కారు వారి పాట
Mahesh Babu
Follow us on

నమ్రత మ్యామ్‌.. సార్‌కు దిష్టి తీయండి! ఇది ప్రిన్స్ క్లాసిక్ ఫ్యాన్స్ స్వీట్ రిక్వెస్ట్. బాబులకే బాబు మా మహేష్ బాబు.. రికార్డులు బద్దలైపోయాయన్న..! ఇది ప్రిన్స్ మాస్‌ ఫ్యాన్స్ మాసీ డైలాగ్‌. ఏటి చేసేది.. అయ్‌! చేసేస్తడట? ఇది ప్రిన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.. అందరి హీరోస్ ఫ్యాన్స్ పై వేస్తున్న పంచ్‌! ఎందుకంటే.. టైగర్ రాబిట్ ను డేట్ చేస్తే.. ఏమవుతుందో.. ఎలా వుంటుందో క్లియర్ కట్‌గా మహేష్ అందరికీ తెలిసేలా చేశాడు కాబట్టి. బాక్సాఫీస్ ను మరో సారి బద్దలు కొట్టేశాడు కాబట్టి. ఈ రేంజ్‌ హిట్ బాబుకొక్కడికే సాధ్యం కాబట్టి..! ముందు చెప్పిన డైలాగులు పేలుతున్నాయి. రిక్వెస్టులు ఓ రేంజ్లో వెళుతున్నాయ్‌.

ఎస్ ! జెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే కేజీఎఫ్ 2 రికార్డును బద్దలు కొట్టిన మన సర్కారోడు.. తాజాగా ఫస్ట్ డే కలెక్షన్‌ ఫిగర్ తో తన స్టామినా ఏంటో సైలెంట్‌ గా చూపించేశాడు. వరల్డ్‌ వైడ్ ఫస్ట్ డే 75 క్రోర్ గ్రాస్‌ను సర్కారుతో సాధించాడు. రీజనల్ ఫిల్మ్ దమ్ము ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు. పాన్ ఇండియా ఫిల్మ్ అన్న కాన్సెప్ట్ కే పంచిచ్చాడు. ఇక తాజాగా ఇదే విషయాన్ని అఫీషియల్‌ గా అనైన్స్ చేశారు మేకర్స్. పరుశురామ్ డైరెక్షన్లో తెరకెక్కిన మహేష్ సర్కారు వారి పాట 75 కోట్ల గ్రాస్‌ను రికవరీ చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానితో పాటు రిజనల్ ఫిల్మ్ ఆల్‌టైం రికార్డనే పోస్టర్ ను కూడా ఫ్యాన్స్ కోసం వదిలారు. ముందు ముందు మహేష్ సినిమా మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

Hebah Patel: క్లాస్ లుక్ లో హెబ్బా పటేల్.. చూడముచ్చటగా ఉందంటున్న ఫ్యాన్స్

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Anasuya Bharadwaj: ఖతర్నాక్ ఫోజులతో కవ్విస్తున్న అను.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్