Mahesh Babu: గాంధీ తాత చెట్టు సినిమా చూసిన మహేష్‌ బాబు.. సుకుమార్ కూతురి గురించి ఏమన్నాడంటే?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పుష్ప 2 సినిమాతో ఆయన క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. ఇప్పుడు సుక్కు బాటలోనే అడుగులు వేస్తూ ఆయన కూతురు సుకృతి వేణి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

Mahesh Babu: గాంధీ తాత చెట్టు సినిమా చూసిన మహేష్‌ బాబు.. సుకుమార్ కూతురి గురించి ఏమన్నాడంటే?
Mahesh Babu

Updated on: Jan 24, 2025 | 12:39 PM

సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఇది ఆమె మొదటి సినిమా. రిలీజ్ కు ముందే ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న గాంధీ తాత చెట్టు సినిమా శుక్రవారం (జనవరి 24) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినీ, మీడియా ప్రముఖుల కోసం గురువారం (జనవరి 23) ఈ సినిమా స్పెషల్‌ ప్రీమియర్స్ వేశారు. దీంతో పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు గాంధీ తాత చెట్టు సినిమాను వీక్షించాడు. అనంతరం ట్విట్టర్ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘ గాంధీ తాత చెట్టు సినిమా ఎప్పటికీ మనతో ఉండిపోతుంది. అహింస గురించి అద్భుతమైన కథను అందంగా చూపించారు. సుకృతి వేణి యాక్టింగ్‌ చూస్తే గర్వంగా అనిపించింది. అందరూ ఈ చిత్రాన్ని తప్పకుండా వీక్షించండి’ అని కోరాడు మహేశ్ బాబు.

గాంధీ తాత చెట్టు సినిమాకు పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. సుకుమార్ భార్య తబితా, నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భాను ప్రకాష్, ఆనంద చక్రపాణి, రాగ్ మయూర్, రఘురామ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా విడుదలైన ప్రతి చోటా గాంధీ తాత చెట్టు సినిమాకు మంచి స్పందన వస్తోంది. అలాగే సుకుమార్ కూతురి నటనపై కూడా ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వారి తల్లిదండ్రులందరూ గాంధీ తాత చెట్టు సినిమా చూడాలని రివ్యూయర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు ట్వీట్..

రిలీజ్ కు ముందే అవార్డులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.