Mahesh Babu: ‘లెజెండ్ బరిలోకి ఇలా ఉంటుంది.. షారుఖ్ కెరీర్‏లోనే బెస్ట్ మూవీ’.. జవాన్ సినిమాపై మహేష్ రివ్యూ..

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడలో విడుదలైన జవాన్ సినిమా తొలిరోజే రికార్డ్స్ కొల్లగొట్టేసింది. ఇప్పటివరకు క్లాసీ మూవీస్ తో లవర్ బాయ్ గా కనిపించిన షారుఖ్ ను ఎప్పుడూ చూడని మాస్ లుక్ లో చూపించి సర్ ప్రైజ్ చేశాడు డైరెక్టర్ అట్లీ. జవాన్ చిత్రానికి అంతటా మంచి రేటింగ్స్, పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. దీంతో అటు కలెక్షన్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. తాజాగా జవాన్ చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ వీక్షించారు. ఈ సినిమాపై తన రివ్యూను ఇస్తూ షారుఖ్ పై ప్రశంసలు కురిపించారు.

Mahesh Babu: లెజెండ్ బరిలోకి ఇలా ఉంటుంది.. షారుఖ్ కెరీర్‏లోనే బెస్ట్ మూవీ.. జవాన్ సినిమాపై మహేష్ రివ్యూ..
Shah Rukh Khan, Mahesh Babu

Updated on: Sep 08, 2023 | 4:00 PM

బాద్ షా ఆగయా.. బాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకొస్తోన్న కింగ్. చాలా కాలం తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు షారుఖ్ ఖాన్. పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ ఉన్న ఖాన్… ఇప్పుడు సౌత్ అడియన్స్ కు సైతం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇటీవలే పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న షారుఖ్.. తాజాగా జవాన్ సినిమాతో మరోసారి సెన్సెషన్ సృష్టించాడు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడలో విడుదలైన జవాన్ సినిమా తొలిరోజే రికార్డ్స్ కొల్లగొట్టేసింది. ఇప్పటివరకు క్లాసీ మూవీస్ తో లవర్ బాయ్ గా కనిపించిన షారుఖ్ ను ఎప్పుడూ చూడని మాస్ లుక్ లో చూపించి సర్ ప్రైజ్ చేశాడు డైరెక్టర్ అట్లీ. జవాన్ చిత్రానికి అంతటా మంచి రేటింగ్స్, పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. దీంతో అటు కలెక్షన్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. తాజాగా జవాన్ చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వీక్షించారు. ఈ సినిమాపై తన రివ్యూను ఇస్తూ షారుఖ్ పై ప్రశంసలు కురిపించారు.

“బ్లాక్ బస్టర్ సినిమా. రాజును రాజు సైజులో చూపిస్తూ వినోదాన్ని అందించారు డైరెక్టర్ అట్లీ. షారుఖ్ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్. ఆయన తెరపై కనిపించినప్పుడు వచ్చిన ఆ ఆరా, చరిష్మా ఇంక ఎవ్వరిలోనూ కనిపించదు. ఆయన స్క్రిన్ ప్రజెన్స్, ఎనర్జీ ఎవరూ మ్యాచ్ చేయలేరు. తెరపై ఫైర్ పుట్టించేశాడు. జవాన్ చిత్రంతో తన రికార్డ్స్ తనే బద్దలు కొట్టేసుకుంటున్నాడు. ఇది వినడానికి చాలా బాగుంది. లెజెండ్స్ బరిలోకి దిగితే అంతే ఉంటుంది ” అంటూ మహేష్ తన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు జవాన్ సినిమాను కుటుంబంతో కలిసి చూసేందుకు వెయిట్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు మహేష్. అలాగే షారుఖ్ తోపాటు అట్లీకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ ట్వీట్ చూసిన షారుఖ్.. థాంక్స్ చెబుతూనే మహేష్ తో కలిసి సినిమా చూస్తానంటూ షారుఖ్ రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి చాటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇదిలా ఉంటే.. తొలి రోజే జవాన్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాల అంచనా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.