
మహేశ్-రాజమౌళి సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్ర, ప్రియాంక చోప్రా మందాకిని రోల్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. వీటికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక శనివారం (నవంబరు 15) సాయంత్రం ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఓ భారీ ఈవెంట్ జరగనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈ వేడుక కోసం చిత్ర బృందంతో పాటు అతిరథ మహారథులు తరలిరానున్నారని తెలుస్తోంది. అలాగే అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతోన్న వరుస ప్రమాదాల దృష్ట్యా భారీ బందోబస్తు మధ్య అత్యంత పకడ్బందీగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ను నిర్వహించాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే ఓ వీడియోను రిలీజ్ చేశారు. అభిమానులకు తగిన సూచనలు చెప్పారు.
తాజాగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కు సంబంధించి మహేష్ బాబు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ ఈవెంట్ కు హాజరయ్యే అభిమానులకు కీలక సూచనలు జారీ చేశాడు. ‘గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ రోజున ఆర్ఎఫ్‌సీ మెయిన్ గేట్ మూసేసి ఉంటుంది. మీతో పాటు ఉన్న పాస్ స్కాన్ చేస్తే మీరు ఏ గేటు నుంచి రావాలో చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించండి. పోలీసులకు, సెక్యూరిటీ వాళ్లకు సహకరించండి. పోలీసులు మనకు చెప్పింది ఏంటంటే.. అందరూ ఎంత తక్కువ ట్రాన్స్‌పోర్టేషన్‌తో వస్తే అందరికీ అంత ఈజీగా ఉంటుంది. పాస్‌పోర్ట్ (ఈవెంట్ పాస్ ) లేకుండా కంగారుపడి వచ్చేయకండి. మనకు ఇలాంటివి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం కలుద్దాం’ అని మహేశ్ బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Tomorrow it is… 🤗🤗🤗
Come safely, enjoy it and go home safely.❤️❤️❤️ #GlobeTrotter pic.twitter.com/5ybhjJ5ZP4— Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2025
కాగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మహేశ్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ బిగ్ ఈవెంట్ వెళ్లలేకపోతే జియో హాట్‌స్టార్ ఓటీటీలో లైవ్‌గా చూడొచ్చు.
Let’s begin the show 😉#Globetrotter pic.twitter.com/IyDeTaBITy
— Suma Kanakala (@ItsSumaKanakala) November 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.