Mahesh Babu: మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. అవుట్ ఆఫ్ ది వరల్డ్.. ఆర్ఆర్ఆర్ మహేష్ బాబు ట్వీట్ వైరల్..

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో

Mahesh Babu: మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. అవుట్ ఆఫ్ ది వరల్డ్.. ఆర్ఆర్ఆర్ మహేష్ బాబు ట్వీట్ వైరల్..
Mahesh
Follow us

|

Updated on: Mar 26, 2022 | 5:01 PM

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు క్రాస్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్.. ఎన్టీఆర్ నటనకు అభిమానులే కాదు.. సెలబ్రెటీలు.. సినీ విశ్లేషకులు సైతం ఫిదా అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ పరంగా ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీతో మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచేశాడు రాజమౌళి.. మెగాస్టార్ చిరంజీవి.. అల్లు అర్జున్.. సుకుమార్.. డైరెక్టర్ శంకర్ ఆర్ఆర్ఆర్ సినిమా చూసి రాజమౌళి… చరణ్.. తారక్‏లతోపాటు.. ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ సినిమా చూసి రాజమౌళిని పొగుడుతూ వరుస ట్వీట్స్ చేశారు.

” సినిమాలు ఉన్నాయి.. అందులో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాలు ఉన్నాయి.. ఆర్ఆర్ఆర్ ఎపిక్.. తెరకెక్కించిన స్థాయి.. గ్రాండియర్ విజువల్స్, మ్యూజిక్ & ఎమోషన్స్ అనూహ్యమైనవి, ఉత్కంఠభరితమైనవి మరియు అద్భుతమైనవి.. సినిమాలోని సీన్స్ చూస్తూ మనల్ని మనం మర్చిపోతాం. కేవలం మాస్టర్ స్టోరీ టెల్లర్ మాత్రమే అలా చేయగలరు. అదిరిపోయే సెన్సెషనల్ సినిమాను తెరకెక్కించారు. రాజమౌళి సర్ మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. రామ్ చరణ్.. ఎన్టీఆర్ స్టార్డం నుంచి బయటకు వచ్చి అద్భుతంగా నటించారు. అవుట్ ఆఫ్ ది వరల్డ్ గా నటించేశారు. నిజంగా వారు అదరగొట్టారు. ఆర్ఆర్ఆర్ టీం మొత్తానికి కంగ్రాట్స్..ఇంత గొప్ప చిత్రాన్ని మీరు తీసినందుకు నాకు గర్వంగా ఉంది ” అంటూ ట్వీట్స్ చేశాడు మహేష్..

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Beast: పాన్ ఇండియా స్టార్‏గా హీరో విజయ్ ప్రయత్నం.. బీస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

RRR Movie: ‘మహారాజ’ మౌళికి హ్యాట్సాఫ్.. రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించిన పాన్ ఇండియా డైరెక్టర్..

Prakash Raj: పుట్టిన రోజు వేళ ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఇక ఆ బాధ్యత నాదేనంటూ..

Indian Idol Telugu: ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్‏లో ఛాలెంజింగ్ ఎపిసోడ్.. ఓటింగ్ లైన్స్ ప్రారంభం..

Latest Articles
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే