Mahesh Babu’s Pokiri: మంచి మనసు చాటుకున్న మహేష్ ఫ్యాన్స్.. ‘పోకిరి’ స్పెషల్ షో కలెక్షన్స్‌ను ఏం చేశారంటే

సూపర్ స్టార్ మహేష్ బాబును హీరోగానే కాదు దేవుడుగా కొలుస్తుంటారు ఆయన అభిమానులు. మహేష్ తన సినిమాలతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mahesh Babu's Pokiri: మంచి మనసు చాటుకున్న మహేష్ ఫ్యాన్స్.. 'పోకిరి' స్పెషల్ షో కలెక్షన్స్‌ను ఏం చేశారంటే
Pokiri
Follow us

|

Updated on: Aug 13, 2022 | 4:32 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ను హీరోగానే కాదు దేవుడుగా కొలుస్తుంటారు ఆయన అభిమానులు. మహేష్ తన సినిమాలతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సేవ గుణంలోనూ మహేష్ అగ్రస్థానంలోనే నిలుస్తున్నాడు. వేల సంఖ్యలో చిన్నారుల గుండె ఆపరేషన్స్ చేయించి ఆ తల్లి దండ్రుల కళ్లలో వెలుగులు నింపుతున్నాడు. శ్రీమంతుడు సినిమా స్పూర్తితో రెండు గ్రామాలను దత్తత తీసుకొని వాటి బాగోగులు చూసుకుంటున్నారు. అలాగే మరెన్నో గుప్తదానాలు కూడా చేస్తున్నారు మహేష్. అయితే మహేష్ ఫ్యాన్స్ కూడా ఆయన బాటలోనే నడుస్తూ ఉంటారు. రీసెంట్ గా మహేష్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు మహేష్ ఫ్యాన్స్. మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు.

మహేష్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా పోకిరి సినిమా 4 కే ప్రింట్ తో దేశవ్యాప్తంగా దాదాపు 300 థియేటర్స్ తో పోకిరి సినిమాను రిలీజ్ చేశారు. దాంతో మహేష్ అభిమానులు థియటర్స్ కు తండోపతండాలుగా వచ్చారు. అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవ్వడంతో మరికొన్ని షోలను కూడా పెంచారు. అయితే ఈ సినిమా ఒక్క రోజులో పోకిరి స్పెషల్ షోలు ప్రపంచ వ్యాప్తంగా 1.73 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేశాయి. టాలీవుడ్‌లో రీ-రిలీజ్ అయిన ఏ సినిమాకు ఇంత కలెక్షన్ రాలేదు. భారతీయ సినిమా చరిత్రలో కూడా ఇది ఎన్నడూ లేని రికార్డు అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక మొత్తాన్ని మహేష్ అబిమానులు ఎంబీ ఫాండేషన్ కు అలాగే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ట్రస్ట్ కు అందించనున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్.

ఇవి కూడా చదవండి

Mahesh Babu

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి