Mahesh Babu: అమెరికాలోనూ ఊపేస్తున్న మహేష్ మాస్ సాంగ్.. కుర్చీ మడతబెట్టి సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు

మహేష్ బాబు లుక్, యాక్టింగ్, కామెడీ టైమింగ్ అని ప్రేక్షకులను మెప్పించాయి. కానీ ఎందుకో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆతర్వాత మెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యింది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం విపరీతంగా పాపులర్ అయ్యింది. తమన్ సంగీతం అందించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ సాంగ్ బాగా క్లిక్ అయ్యింది.

Mahesh Babu: అమెరికాలోనూ ఊపేస్తున్న మహేష్ మాస్ సాంగ్.. కుర్చీ మడతబెట్టి సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు
Mahesh Babu
Follow us

|

Updated on: Apr 02, 2024 | 1:32 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ నుంచి ఓ సాలిడ్ హిట్ రావాలని అభిమానులు ఆశపడుతున్నారు. చివరిగా గుంటూరు కారం సినిమా వచ్చినప్పటికీ అభిమానులకు ఆ కిక్ సరిపోలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో కనిపించారు. మహేష్ బాబు లుక్, యాక్టింగ్, కామెడీ టైమింగ్ అని ప్రేక్షకులను మెప్పించాయి. కానీ ఎందుకో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆతర్వాత మెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యింది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం విపరీతంగా పాపులర్ అయ్యింది. తమన్ సంగీతం అందించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ సాంగ్ బాగా క్లిక్ అయ్యింది.

ఆ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ ఎక్కడ చూసిన అదే పాట వినిపిస్తుంది. చాలా మంది ఈ పాటను రీల్స్ గా చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సెలబ్రెటీలు కూడా ఈసాంగ్ కు స్టెప్పులేసి సోషల్ మీడియాలో ఆ వీడియోలను షేర్ చేశారు. విదేశాల్లోనూ ఈ పాట ఊపేస్తోంది. తాజాగా అమెరికాలో మహేష్ బాబు సాంగ్ కు మాస్ స్టెప్పులేశారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇండియా వైడ్ గా ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది. ఈవెంట్స్ లో, కాలేజ్ ఫంక్షన్స్ లో, పెళ్లిళ్లలో కుర్చీ మడత పెట్టి సాంగ్ వినిపిస్తుంది. తాజాగా అమెరికాలోనూ ఈ సాంగ్ హవా కనిపించింది. ప్రస్తుతం అమెరికా హూస్టన్ లో నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ గేమ్స్ మధ్యలో బ్రేక్ సమయంలో ఇలా మహేష్ బాబు సాంగ్ కు కొంతమంది డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మహేష్ బాబు అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.