ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. గుంటూరు కారం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇప్పటికే సినిమాకు అవసరమైనట్లుగా పొడవాటి జట్టు, బాడీ పెంచి తన లుక్ ను మొత్తం ఛేంజ్ చేశాడు. అందుకు ఇటీవల మహేశ్ ఎక్కడ కనిపించినా అతని లుక్ తెగ వైరలవుతోంది. ఇటీవల అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకలోనూ మహేశ్ బాబు సూపర్ స్టైలిష్ గా కనిపించి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇందులో ఒక స్టూడియోకు వెళ్లిన సూపర్ స్టార్ను అక్కడున్న జనాలు, అభిమానులు చుట్టు ముట్టేశారు. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో మహేశ్ కూడా ఎంతో ఓపికగా అడిగినవారందరికీ సెల్ఫీలు ఇచ్చాడు.
ఈ క్రమంలోనే ఒక పోలీస్ అధికారి కూడా మహేశ్ దగ్గరకు వచ్చి సెల్ఫీ ఇవ్వమని కోరాడు. దీంతో వెంటనే మహేశ్ బాబు ఆయనకు సెల్ఫీ ఇచ్చాడు. అయితే ఈ అవకాశం దక్కని మరికొందరు దూరం నుంచే ఫొటోస్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం మహేశ్ బాబుకు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఇందులో మహేశ్ హెయిర్ స్టైల్, లుక్ అదిరిపోయిదంటూ ఈ వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా మహేష్ – రాజమౌళి సినిమాకు సంబంధించి ఆల్రెడీ స్క్రిప్ర్ వర్క్ పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుపెడతారని తెలుస్తోంది. మహేశ్ బాబు పుట్టిన రోజు (ఆగస్టు 09)న రాజమౌళి క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడనుందని సమాచారం.
#TFNExclusive: Unseen visuals of Super 🌟 @urstrulymahesh as he gets mobbed by fans for selfies!! ❤️🔥🤳#MaheshBabu #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/JUDfwYDWHc
— Telugu FilmNagar (@telugufilmnagar) July 31, 2024
A special night celebrating the union of this lovely couple! 💥💥💥 Wishing the family & #AnantRadhika a lifetime of happiness in this beautiful journey of marriage ♥️♥️♥️ pic.twitter.com/Lo5WiXjyRl
— Mahesh Babu (@urstrulyMahesh) July 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..