Sarkaru Vaari Paata: దుబాయ్‌లో టేకాఫ్‌ గోవాలో ల్యాండింగ్‌.. షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పిన మహేష్‌ టీమ్‌..

Sarkaru Vaari Paata Dubai Schedule: టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై..

Sarkaru Vaari Paata: దుబాయ్‌లో టేకాఫ్‌ గోవాలో ల్యాండింగ్‌.. షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పిన మహేష్‌ టీమ్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 21, 2021 | 9:34 PM

Sarkaru Vaari Paata Dubai Schedule: టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయని చెప్పాలి. ఇక తాజాగా ఈ సినిమా షెడ్యూల్‌ దుబాయ్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దుబాయ్‌లోని రిచ్‌ లొకేషన్స్‌లో తెరకెక్కించారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్‌ దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించి వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా సర్కారు వారి పాట టీమ్‌.. దుబాయ్‌కి గుడ్‌ బై చెప్పింది. దాదాపు నెల రోజులకిపైగా దుబాయ్‌లో షూటింగ్‌ జరుపుకున్న సర్కారు వారి పాట సినిమా షెడ్యూల్‌ ఆదివారంతో పూర్తయింది. ఇక దుబాయ్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్‌ తర్వాత గోవా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కీలక సన్నివేశాలను గోవాలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Also Read: Check Movie: ‘చెక్‌ మూవీ ఐడియా పదిహేను ఏళ్లుగా నాలో ఉంది’.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన దర్శకుడు..