Mahesh Babu: మహేశ్‌ ఫ్యామిలీ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌..కలర్‌ ఫుల్‌ ఫొటోతో విషెస్‌ చెప్పిన సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు దుబాయ్‌లో నూతన సంవత్సరం వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసున్న ఒక కలర్‌ ఫుల్‌ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు సూపర్‌ స్టార్‌.  ఇందులో నమ్రత ఎంతో హ్యాపీగా మహేష్ భుజంపై తల వాల్చుతూ కనిపించింది.

Mahesh Babu: మహేశ్‌ ఫ్యామిలీ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌..కలర్‌ ఫుల్‌ ఫొటోతో విషెస్‌ చెప్పిన సూపర్‌ స్టార్‌
Mahesh Babu Family

Edited By:

Updated on: Jan 02, 2024 | 12:07 PM

నూతన సంవత్సారానికి అందరూ గ్రాండ్‌గా స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను జరుపుకొన్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమానులకు, ఫాలోవర్లకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు దుబాయ్‌లో నూతన సంవత్సరం వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసున్న ఒక కలర్‌ ఫుల్‌ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు సూపర్‌ స్టార్‌.  ఇందులో నమ్రత ఎంతో హ్యాపీగా మహేష్ భుజంపై తల వాల్చుతూ కనిపించింది. దీనికి ‘సహజత్వం. నవ్వు. ప్రేమ. సాహసం. ఎదుగుదల’ అని క్యాప్షన్‌ ఇస్తూ అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భార్యపై తన ప్రేమకు ప్రతీకగా లవ్‌ ఎమోజీని కూడా షేర్‌ చేశారు. ఈ పోస్టుకు నమత్ర కూడా వెంటనే రిప్లై ఇచ్చింది. ‘లవ్ యు టు ది మూన్ అండ్ బ్యాక్.. ఎప్పటికీ’ అంటూ లవ్‌ ఎమోజీలు షేర్‌ చేసింది. ప్రస్తుతం మహేశ్‌ బాబు షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. మహేశ్‌- నమ్రతల జోడీ ఎంతో క్యూట్‌గా ఉందంటున్నారు అభిమానులు, నెటిజన్లు. అలాగే ప్రతిగా న్యూ ఇయర్‌ విషెస్‌ చెబుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతికి గుంటూరు కారంతో సినిమాతో మన ముందుకు రానున్నాడు మహేశ్‌. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి సెకెండ్‌ లీడ్‌లో మెరవనుంది. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్‌రాజ్‌, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. థమన్‌ అందించిన స్వరాలు ఇప్పటికే అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయ. ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌ యూ ట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న గుంటూరు కారం  సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

ఇవి కూడా చదవండి

నమ్రతతో మహేశ్ బాబు ..

దుబాయ్ వెకేషన్ లో బిజీ బిజీగా..

భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో మహేశ్ బాబు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.