SSMB 29: అవన్నీ రూమర్లే.. అసలు విషయం చెప్పిన మేకర్స్.. SSMB29 పై ఫుల్ క్లారిటీ
చివరిగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గుంటూరు కారం సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది ఈ మూవీ. దాంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు, రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చివరిగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గుంటూరు కారం సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది ఈ మూవీ. దాంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు, రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు నయా లుక్ లోకి మారిపోయారు. హాలీవుడ్ హీరోలను తలదన్నేలా కనిపిస్తున్నారు మహేష్.
ఇదిలా ఉంటే మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన దీపికాపదుకునే హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వచ్చింది. అంతే కాదు ఈ సినిమానుంచి డీఓపీ తప్పుకున్నారని కూడా ప్రచారం జరిగింది అలాగే వీరేన్ స్వామి అనే క్యాస్టింగ్ డైరెక్టర్ ఈ సినిమాలో జాయిన్ అయ్యారని జోరుగా ప్రచారం జరిగింది. దాంతో మేకర్స్ ఈ రూమర్స్ పై సీరియస్ అయ్యారు.
తాజాగా మహేష్ సినిమా గురించి వస్తున్న రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి-మహేశ్‌బాబు ప్రాజెక్ట్‌కు సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే.. కొన్ని ఇంగ్లీష్ వెబ్‌సైట్స్‌లో వచ్చిన వార్తలు మా దృష్టికి వచ్చాయి. కాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి సినిమాలో జాయిన్ అయ్యారని రాసుకొచ్చారు. అందులో నిజం లేదు. ఈ మూవీకి సంబంధించి ఏ అప్‌డేట్ అయినా మేమే ఇస్తాం. ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ తప్ప మరే ఇతర అప్‌డేట్‌లను నమ్మొద్దు అని రాసుకొచ్చారు మేకర్స్. దాంతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై క్లారిటీ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీ ఎలా ఉంటుందా అని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.