నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు టాప్ యాక్టర్..
రంగస్థలం మహేష్ తన జీవిత ప్రయాణాన్ని, సినీ రంగంలోకి రాకముందు కోకో-కోలాలో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. తండ్రి మరణించినప్పుడు అంత్యక్రియలకు కట్టెల కోసం 500 రూపాయలు కూడా లేని నిస్సహాయ స్థితిని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ క్షణం తన జీవితంలో అత్యంత బాధాకరమైనదని, సినీ రంగంలో కొనసాగాలా వద్దా అని తీవ్రంగా ఆలోచించానని మహేష్ తెలిపారు.

రంగస్థలం మహేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానం, ఎదుర్కొన్న కష్టాలపై మనసు విప్పి మాట్లాడారు. 2011లో డిగ్రీ పూర్తయిన తర్వాత డిస్టెన్స్‌లో ఎంబీఏ ఫైనాన్స్ చదువుతూ కోకో-కోలా కంపెనీలో నైట్ షిఫ్ట్ చేసేవాడినని ఆయన తెలిపాడు. నెలకు ఆరు వేల రూపాయల జీతంతో, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేస్తూ, పగలు ఆడిషన్ల కోసం నడుచుకుంటూ తిరిగేవారు. పగటిపూట సినిమాల కోసం ప్రయత్నిస్తూ, రాత్రిపూట ఉద్యోగం చేసేవాడినని పేర్కొన్నాడు. ఒక రోజు రాత్రి డ్యూటీలో నిద్రపోవడం వల్ల మేనేజర్ “నువ్వు సినిమాలో నటిస్తావో లేదా ఉద్యోగం చేస్తావో తేల్చుకో” అని చెప్పడంతో కోకో-కోలా ఉద్యోగం మానేసి పూర్తిస్థాయిలో సినీ రంగంపై దృష్టి సారించానని చెప్పారు. మహేష్ తన జీవితంలో ఎప్పుడూ పెద్దగా భావోద్వేగాలకు లోను కాలేదని, కష్టపడితే మంచి జీవితం ఉంటుందని నమ్మేవాడినని పేర్కొన్నాడు.
కానీ, తన తండ్రి మరణించినప్పుడు ఎదురైన సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. హీరో నితిన్ ఆఫీస్ దగ్గర ఫోటో ఇచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా తండ్రి మరణించినట్లు కాల్ వచ్చిందని, ఆ సమయంలో తన దగ్గర వంద రూపాయలు కూడా లేవని మహేష్ గుర్తుచేసుకున్నారు. ఆకుల రాము అనే అసిస్టెంట్ డైరెక్టర్, అతని సోదరుడు రామ్ శ్రీను సహాయంతో డబ్బులు సమకూర్చారని చెప్పారు. ఆ డబ్బులు ఇంటికి వెళ్లేలోపే ఖర్చయ్యాయని, తన తమ్ముడు “పెదనాన్నను తీసుకువెళ్లడానికి పుల్లల కోసం డబ్బులు అడుగుతున్నారు” అని అడిగినప్పుడు, తన దగ్గర 500 రూపాయలు కూడా లేవని మహేష్ వాపోయారు. తండ్రిని స్మశానానికి తీసుకువెళ్లి దహనం చేయడానికి కట్టెలకు 500 రూపాయలు లేని స్థితి తనను తీవ్రంగా కుంగదీసిందని, “ఏంటిరా ఈ బతుకు” అని చాలా బాధపడ్డానని తెలిపారు. ఆ సమయంలో తాను సినిమాను నమ్ముకున్నానని, కానీ సక్సెస్ కాలేకపోయానని, తన భవిష్యత్తు ఏంటో తెలియక తీవ్రమైన అయోమయంలో పడ్డానని మహేష్ వివరించారు. ఈ సంఘటన జరిగిన నెల రోజుల పాటు సన్నిహితులు, బంధువులు కూడా “ఎందుకురా నీకు సినిమాలు, మీ అమ్మను చూసుకోవచ్చు కదా, పిచ్చి వెదవలాగా అవసరమా ఈ బతుకు” అని విమర్శించారని ఆయన పేర్కొన్నారు. పెద్ద పెద్ద వాళ్లకు, కోట్లు ఉన్న వాళ్లకు కూడా సినిమా అవకాశాలు రావట్లేదని.. వీడికి ఎలా వస్తాయని చాలా మంది తన వెనుక మాట్లాడుకోవడం విన్నానని మహేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ విమర్శలు, ఆర్థిక కష్టాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన తెలిపారు.
అయితే, మహేష్ కృషి ఫలించింది. కమెడియన్ సత్య, రైటర్ ప్రసన్న కుమార్ల సహాయంతో షకలక శంకర్‌కు పరిచయమై, జబర్దస్త్‌లోకి ప్రవేశించారు. మొదటి స్కిట్‌లోనే రోజా ప్రశంసలు అందుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత, జబర్దస్త్ జడ్జ్ నాగబాబు.. పూరి జగన్నాథ్‌కి కాల్ చేసి లోఫర్ సినిమాలో పది రోజుల పాత్రకు రూ.50,000 వరకు ఇప్పించారు. ఆ మొత్తాన్ని ఇంటికి పంపి, అద్దెకు కొంత ఉపయోగించి, మిగిలిన డబ్బుతో తన అవసరాలు తీర్చుకున్నారు. రంగస్థలం సినిమాలో అవకాశంతో మహేష్ జీవితం మలుపు తిరిగింది. తన స్వగ్రామంలో తాటాకు ఇంట్లో నివశించిన మహేష్.. దర్శకుడు సుకుమార్ దయతో తన సొంత ఊరిలోనే నాలుగు సెంట్ల స్థలం కొని ఇల్లు కట్టారు. ఆ ఇల్లు అంటే తన తల్లికి ఎంత ఇష్టమో మహేష్ వివరించారు. ఈ ప్రయాణం అచంట మహేష్ పట్టుదల, కష్టం, కృతజ్ఞతకు నిదర్శనం.

Mahesh In Movie Shoot
Also Read: ఇంత ఓపెన్ మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంది.. వైరల్ ట్రైన్ సీన్‌పై బాలయ్య కామెంట్..
