Adipurush: ‘ఆదిపురుష్‌’పై ఉపముఖ్యమంత్రి ట్వీట్‌.. చిత్రయూనిట్‏కు బెస్ట్ విషెస్..

|

Jun 15, 2023 | 2:44 PM

తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులు ర్యాలీలు చేపట్టారు. ఇక ఇప్పుటికే థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి.. మరికొన్ని గంటల్లో ఈమూవీ విడుదల కాబోతుండగా.. సినీ, రాజకీయ ప్రముఖులంతా చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదిపురుష్ పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అలాగే మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Adipurush: ‘ఆదిపురుష్‌’పై ఉపముఖ్యమంత్రి ట్వీట్‌.. చిత్రయూనిట్‏కు బెస్ట్ విషెస్..
Adipurush
Follow us on

సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ సినిమా రేపు (జూన్ 16న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆదిపురుష్ హంగామా మొదలైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులు ర్యాలీలు చేపట్టారు. ఇక ఇప్పుటికే థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి.. మరికొన్ని గంటల్లో ఈమూవీ విడుదల కాబోతుండగా.. సినీ, రాజకీయ ప్రముఖులంతా చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదిపురుష్ పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అలాగే మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

“మర్యాద పురుషోత్తమ ప్రభు శ్రీరాముడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరిపై ఆ ప్రభు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. ఆదిపురుష్ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ దర్శకనిర్మాతలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ బుకింగ్ పోస్టర్ వేదికగా సినీప్రియులు బుకింగ్స్ చేసుకుండగా..ఇప్పటికే అన్ని థియేటర్లు ఫుల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ టికెట్ ధరలు రూ. 50 వరకు పెంచుకోవచ్చని… ప్రభుత్వాలు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. తెలంగాణలో ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చని సూచించింది ప్రభుత్వం. డైరెక్టర్ ఓంరౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించారు. ఇక ఇందులో సీతమ్మవారి పాత్రలో కృతి సనన్ నటించగా.. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు.

డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.