తమిళ్ స్టార్ హీరో ధనుష్‌కు (Dhanush) మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఇటీవల మధురైలోని మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ మూడవ కుమారుడు అంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ధనుష్ సమర్పించిన జనన దృవీకరణ పత్రాలు నకిలీవని పేర్కోంటూ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని వ్యతిరేకిస్తూ కదిరేశన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ హీరోకు సమన్లు పంపింది హైకోర్టు. ఇప్పటివరకు ధనుష్ అందించిన ఆధారాలపై పోలీసులు విచారణ జరిపించాలని కదిరేశన్ డిమాండ్ చేశారు. దీంతో ధనుష్‌కు సమన్లు జారీ చేసింది కోర్టు..
సినిమాలపై ఉన్న ఆసక్తితో చిన్నప్పుడె ఇల్లు వదిలి చెన్నై వెళ్లిపోయాడని కదిరేశన్, మీనాక్షి దంపతులు తెలిపారు. లేజర్ ట్రీట్మెంట్ వలన శరీరంపై ఉన్న మచ్చలను చెరిపేయవచ్చని వారు పేర్కొన్నారు. తన తల్లిదండ్రులకు నెలవారీ రూ. 65 వేలు పరిహారం చెల్లించాలని కోరారు.. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు ధనుష్.. తాను డైరెక్టర్ కస్తూరి రాజా కుమారుడినంటూ ధనుష్ గతంలో కోర్టుకు జనన ధృవీకరణ పత్రాలు సమర్పించారు. కార్పొరేషన్ అధికారులు సర్టిఫికెట్ల ప్రామాణికతను తనిఖీ చేసి నివేదిక సమర్పించకముందే జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తన అభ్యర్థనను తిరస్కరించిందని అప్పీల్ పై కదిరేశన్ ఆరోపించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Keerthy Suresh: మహేష్ బాబును మూడు సార్లు కొట్టాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..
Megastar Chiranjeevi: పాండమిక్ తర్వాత తొలిసారి చిరంజీవి అలా.. చాలాకాలం తర్వాత సతీమణితో చిరు సెల్ఫీ..
God Father: సల్మాన్‌తో చిరు మాస్ బీట్.. ఇండియన్ మైకెల్ జాక్సన్ కొరియోగ్రఫీలో..