Chiranjeevi: చిరంజీవిపై పరువు నష్టం దావా.. మన్సూర్‌ అలీఖాన్‌ తిక్క కుదిర్చిన హైకోర్టు.. ఏమందో తెలుసా?

|

Dec 11, 2023 | 9:09 PM

మెగాస్టార్‌ చిరంజీవి, ఆర్కే రోజా, నితిన్‌, లోకేష్‌ కనగరాజ్‌, మాళవికా మోహనన్‌, ఖుష్బూ, సింగర్‌ చిన్మయి మన్సూర్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. త్రిషకు సపోర్టుగా నిలిచారు. జాతీయ మహిళా కమీషన్‌ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో మన్సూర్‌ దిగొచ్చాడు. త్రిషకు క్షమాపణలు చెప్పాడు. అంతటితో గొడవ సద్దుమణిగిందనుకున్నారు

Chiranjeevi: చిరంజీవిపై పరువు నష్టం దావా.. మన్సూర్‌ అలీఖాన్‌ తిక్క కుదిర్చిన హైకోర్టు.. ఏమందో తెలుసా?
Mansoor Ali Khan, Chiranjeevi, Trisha
Follow us on

హీరోయిన్‌ త్రిష, నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ వివాదం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది. లియో సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన మన్సూర్‌ త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో త్రిషతో పాటు పలువురు సినీ ప్రముఖులు మన్సూర్‌ అలీ ఖాన్‌ కామెంట్స్‌పై మండిపడ్డారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆర్కే రోజా, నితిన్‌, లోకేష్‌ కనగరాజ్‌, మాళవికా మోహనన్‌, ఖుష్బూ, సింగర్‌ చిన్మయి మన్సూర్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. త్రిషకు సపోర్టుగా నిలిచారు. జాతీయ మహిళా కమీషన్‌ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో మన్సూర్‌ దిగొచ్చాడు. త్రిషకు క్షమాపణలు చెప్పాడు. అంతటితో గొడవ సద్దుమణిగిందనుకున్నారు చాలామంది. అయితే మన్సూర్‌ మళ్లీ గొడవను రాజేశాడు. రెండు రోజులు సైలెంట్‌గా ఉన్న ఈ నటుడు త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా మాట్లాడిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా కేసు వేశాడు. తనను అనరాని మాటలు అన్నారంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మన్సూర్‌కి మొట్టికాయలు వేసేలా తీర్పు ఇచ్చింది.

‘మీకు (మన్సూర్‌ అలీఖాన్‌) గొడవల్లో తలదూర్చడం బాగా అలవాటైపోయింది. ప్రతిసారి ఏదో ఒక విషయంపై వివాదం రేకెత్తించడం, ఆ తర్వాత నేను అమాయకుడిని అనడం మీకు బాగా పరిపాటిగా మారింది. పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్‌లో హీనమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ ముందుగా త్రిష నీపై కేసు పెట్టాలి. మాజంలో ఎలా మెలగాలో నేర్చుకో’ అంటూ మన్సూర్‌ను తలంటుపోసింది మద్రాస్‌ హైకోర్టు. ఈ సందర్భంగా మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో (ఎడిట్‌ చేయని) ను సమర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి మన్సూర్‌ తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు. దీంతో అన్‌ కట్‌ వీడియోను సమర్పిస్తామని మన్సూర్ తరపు న్యాయవాది అంగీకరించారు. అయితే మన్సూర్‌పై త్రిష సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్టులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో న్యాయమూర్తి స్పందిస్తూ… త్రిష, ఖుష్బూ, చిరంజీవి కూడా ఈ కేసులో తమ వాదనలు సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబరు 22కి వాయిదా వేశారు.

ఇవి కూడా చదవండి

ముందు నీపై కేసు పెట్టాలంటూ..

త్రిషకు మద్దతుగా చిరంజీవి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.