Maa Elections 2021: నాకు ఎటువంటి సంబంధం లేదు.. నాకు ఏ లెటర్ రాలేదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి..

మా ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా రచ్చ కంటిన్యూ అవుతుంది. ఎన్నికల ముందు జరిగిన రచ్చ గురించి అందరికి తెలిసిందే.

Maa Elections 2021: నాకు ఎటువంటి సంబంధం లేదు.. నాకు ఏ లెటర్ రాలేదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి..
Maa

Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2021 | 1:47 PM

Maa Elections 2021: మా ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా రచ్చ కంటిన్యూ అవుతుంది. ఎన్నికల ముందు జరిగిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. నానా హంగామా చేశారు.ఇక ఎన్నికల వేళ అయితే ఈ రచ్చ మరో లెవల్ కు వెళ్ళింది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మా ఎన్నికలు జరిగాయి.. రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని వరించాడు. అయితే మంచు ప్యానల్ సభ్యులు ఎన్నికలలో రిగ్గింగ్ చేశారని.. సీసీ టీవీ ఫుటేజ్ తమకు అందించాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో మంచు విష్ణు స్పందిస్తూ.. ప్రకాష్ రాజ్ సీసీ ఫుటేజ్ తీసుకోవచ్చని.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు.

లేటెస్ట్‌గా మరో బాంబు పేల్చారు ప్రకాష్ రాజ్. రౌడీషీటర్లు ‘మా’ ఎన్నికల్ని ప్రభావితం చేశారని ఆరోపించారాయన. ఇదే విషయాన్ని మరోసారి ఈసీ కృష్ణమోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ రోజున జరిగిన తిట్లదండకం, బెదిరింపులకి సంబంధించి సీసీ ఫుటేజ్‌ ఇవ్వాలని ఇప్పటికే కోరారు. ఇప్పుడు మరోసారి రౌడీషీటర్ల పాత్ర ఉందంటూ లేఖాస్త్రం సంధించారు. ఈ వివాదంపై  ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ వివరణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించడం వరకు మాత్రమే నా ప్రమేయం..తరువాత పరిణామాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ నుండి తాజాగా ఎలాంటి లెటర్ రాలేదని అన్నారు కృష్ణ మోహన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA: ‘మా’లో బిగ్ ట్విస్ట్.. ఎన్నికల కేంద్రంలో రౌడీషీట్ ఉన్న వ్యక్తి గుర్తింపు..

Mohan Babu: నటుడు మోహన్‌బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు.. ఎందుకంటే..

Ananya Panday: ఎన్సీబీ అధికారుల ముందు అనన్య పాండే.. డ్రగ్స్ వ్యవహారం పై కొనసాగుతున్న విచారణ..