MAA Elections 2021: ముదురుతున్న మా లొల్లి .. హేమపై సీరియస్ అయిన సీనియర్ నరేష్. చర్యలు తప్పవంటూ..

|

Aug 09, 2021 | 12:08 PM

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ లో ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది. ఇప్పటికే ఒకరి పై మరొకరు విమర్శలు దిగుతూ హడావిడి చేస్తున్నారు.

MAA Elections 2021: ముదురుతున్న మా లొల్లి .. హేమపై సీరియస్ అయిన సీనియర్ నరేష్. చర్యలు తప్పవంటూ..
Hema
Follow us on

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌‌‌(MAA)లో ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది. ఇప్పటికే ఒకరి పై మరొకరు విమర్శలు దిగుతూ హడావిడి చేస్తున్నారు. చాలా రోజులకు ముందే ప్రకాష్ రాజ్ ఒక అడుగు ముందుకు వేసి తన ప్యానల్‌‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే మంచి విష్ణు రంగంలోకి దిగారు. తాను కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానంటూ విష్ణు ప్రకటించారు. ‘మా’ కు సొంత బిల్డింగ్ కట్టాలన్న నినాదంతో మొత్తం ఐదుగురు సభ్యులు ఈ సారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు ఈ పోటీలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల నటి హేమ మాట్లాడుతూ ‘మా’ నిధులను దుర్వినియోగం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో మీడియాలో వైరల్ అయ్యింది. హేమ వ్యాఖ్యలపై ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేష్ స్పందించారు. హేమ చేసిన ఆరోపణలను నరేష్ తప్పుబట్టారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ గౌరవ మర్యాదలను దెబ్బతీసేలా హేమ మాట్లాడారని నరేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని నరేష్ అన్నారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని.. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడుతున్నాయని.. కరోనా దృష్ట్యా ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు నరేష్. కరోనా టైంలో ఎలక్షన్స్ నిర్వహించ కూడదని పలు హై కోర్టులు, సుప్రీం కోర్టు చెప్పింది అన్నారు నరేష్. ఈ నెల 22న జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని అన్నారు.మాలో ప్రస్తుతం దాదాపు 4.70 కోట్లు ఫండ్ వుంది..కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము మా సభ్యుల కోసం ఎన్నో పనులు చేశాం..మా ఫండ్ ను టచ్ చెయ్యకుండా మేము మాకున్న ఇమేజ్ తో ఫండ్ తెచ్చుకున్నాం.. ఇందుకు ఇండస్ట్రీ పెద్దలు, ఫ్రెండ్స్ మాకు ఫండ్స్ విషయంలో సహకరించారు అని నరేష్ అన్నారు.

హేమపై జీవిత కామెంట్స్..

హేమ వాయిస్ మెసేజ్ పై జీవితా రాజశేఖర్ స్పందించారు. మీడియా కి వెళ్ళ కుండా మా సమస్యలను మనమే పరిష్కరించు కుందాము అనే నియమం వుంది. కానీ మేము మీడియా ముందుకు రాక తప్పటం లేదు అని జీవిత అన్నారు. మేము హేమ ఆరోపణల కు వివరణ ఇవ్వకపోతే ఆ ఆరోపణలు నిజం అనుకొనే ప్రమాదం వుంది. హేమ మాటలు చాలా తప్పుగా అనిపించాయని జీవిత అన్నారు. అందరం కలిసి మీటింగ్‌‌‌‌లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నము.

హేమ ఆ నిర్ణయాలను పట్టించుకోకుండా ఇలా మీడియాకి ఏందుకు వచ్చింది.? అని జీవిత ప్రశ్నించించారు. ఎలక్షన్స్ ఎవరు పెట్టమంటున్నారు.? ఎందుకు మా సభ్యులను కన్ఫ్యుజ్ చేస్తున్నారు.? మేము కూర్చొని డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఈ టర్మ్‌‌‌లో కోటి రూపాయలు ఫండ్ సమకుర్చాము అని జీవిత అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anil Ravipudi : దానికి దీనికి అస్సలు సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన  దర్శకుడు అనిల్ రావిపూడి..

Bigg Boss 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ప్రేమ కావాలి బ్యూటీ..? క్లారిటీ ఇచ్చిన ఇషా చావ్లా..

Super Star Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్‌‌‌కు వెల్లువెత్తుతున్న విషెస్.. ఫ్యాన్స్‌‌తోపాటు సినిమాతారలు కూడా..