తెర మీద సంగతేమో గాని… తెర వెనుక మాత్రం టాలీవుడ్‌లో రాబోయే రెండు నెలలూ ఫుల్2ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. ఫిలిమ్ ఇండస్ట్రీలో రసవత్తరంగా జరగబోయే మా ఎన్నికలు… నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టెర్ రేంజ్‌లో.. మలుపుల్ని తీసుకోబోతున్నాయి. అదిగో.. ఆ సిగ్నల్స్ అప్పుడే వచ్చేశాయ్. మా ఎన్నికల జాతరను టాప్‌గేర్‌తో స్టార్ట్ చేసిన ప్రకాశ్‌రాజ్… అదే టెంపోను కంటిన్యూ చేస్తున్నారు. ఈసారి చైర్మన్ కుర్చీ నాదే అంటూ మెగాబ్రదర్ నాగబాబుతో కలిసి ముందడుగేశారాయన. నాన్ లోకల్ అనే ముద్రను చెరిపేసుకోవడం ఇప్పుడాయన ముందున్న ఫస్ట్ టార్గెట్. లేటెస్ట్‌గా తన ప్యానల్‌ని ప్రకటిస్తూ… సిని’మా’ బిడ్డలం… ‘మా’ మనం… అంటూ ఎమోషనల్ స్లోగన్స్‌తో సెంటిమెంట్‌ని రెయిజ్ చేశారు మిస్టర్ మోనార్క్.
జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, బ్రహ్మాజీ లాంటి సీనియర్లంతా నా సైన్యమే అంటున్న ప్రకాశ్‌రాజ్… మరికొందరు పెద్ద తలల మద్దతు కోసం ట్రై చేస్తున్నారు. అట్నుంచి నేను సైతం అంటున్న జీవితా రాజశేఖర్ గతంలో మా సెక్రటరీగా పనిచేసిన అనుభవాన్ని యుటిలైజ్ చేసుకుంటున్నారు. విమెన్ కార్డ్ ప్లే చేసి.. మెగాస్టార్ సపోర్ట్ తీసుకోవాలన్నది ఆమె ప్లాన్. అయితే ఇప్పటికే మెగాస్టార్ మద్దతు ప్రకాశ్‌రాజ్‌కే అంటూ నాగబాబు తేల్చేశారు. మరి ఆమె త్వరలో ఎవరి మద్దతు కూడగడతారో చూడాలి. స్మాల్ అండ్ అప్‌కమింగ్ ఆర్టిస్టులతో ఇప్పటికే టచ్‌లో వున్నారు జీవిత.
తండ్రి మోహన్‌బాబు చరిష్మాను నమ్ముకుని బరిలో దిగిన మంచు విష్ణు.. మరికొందరు పెద్దల మీద కూడా కాన్ఫిడెన్స్‌తో వున్నారు. క్రిష్ణ, క్రిష్ణంరాజు, బాలక్రిష్ణ, మంచు ఫ్యామిలీతో వుంటారని, సహజంగానే దాసరి వర్గం మద్దతు విష్ణుకే వుంటుందని ప్రచారం జరుగుతోంది. నేడోరేపో ప్యానల్‌ని ప్రకటించే పనిలో బిజీగా వుంది మంచు ఫ్యామిలీ. జస్ట్ ట్రెజరర్ పోస్ట్ చాలని చెప్పుకుంటూ వచ్చిన హేమ.. సడన్‌గా అధ్యక్ష పగ్గాలు కావాలంటూ బరిలో నిలిచారు. గతంలో అనేకసార్లు అసోసియేషన్‌లో పనిచేశారు. కానీ.. చివరివరకూ హేమ పోటీలో నిలుస్తారా అనే డౌట్స్ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. అటు… నందమూరి క్యాంప్ కూడా పోటీకొస్తోందన్న రూమర్స్‌కి చెక్ పడింది. మా ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు నందమూరి కల్యాణ్‌రామ్.
Also Read: ఈమెను 90స్ హీరోయిన్ అంటే ఎవరైనా నమ్ముతారా..? రూల్స్‌ను బ్రేక్ చేసి చూపిస్తున్న నటి