సిని’మా’ ఎన్నికలు ముగిశాయి. గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఉత్కంఠకు నిన్నటితో తెర పడింది. నువ్వా నేనా అంటూ సాగిన మా అధ్యక్ష పోరులో చివరికి మంచు విష్ణు విజయం సాధించారు. ఆదివారం ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో జరిగిన మా ఎన్నికల్లో ఎన్నో సిత్రాలు, ఆకస్మాత్తు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక పోలింగ్ కేంద్రంలో ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ మధ్య గొడవలు.. తోపులాటలు జరిగిన సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈసారి మా ఎన్నికలు జరిగాయి. అలాగే.. ఎప్పుడు లేనంతగా.. పోలింగ్ కౌంట్ నమోదయైంది. ఎన్నో ఆసక్తికర పరిణామాల మధ్య.. తీవ్ర ఉత్కంఠ మధ్య మా అధ్యక్ష పదవిని మంచువారబ్బాయికి పట్టం కట్టారు ఆర్టిస్టులు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే సమయంలో మంచు విష్ణు భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్‌ను పట్టుకునే గట్టిగా ఏడ్చేశారు. అనంతరం.. తన విజయాన్ని తన తండ్రి మోహన్ బాబుకు అంకితమిచ్చారు.
ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం మంచు విష్ణు తన ట్విట్టర్ వేదికగా మా ఎన్నికలపై మరోసారి స్పందించారు. శుభోదయం! నా సినిమా సోదరులు నాకు చూపించిన ప్రేమ, మద్దతు పై నేను వినయపూర్వకంగా ఉన్నాను. మా ఎన్నికలపై నేను ఇంకా ఏదైనా చెప్పే ముందు, ఈసీ సభ్యులు, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ పోస్టులలో ఒకదానికి కౌంటింగ్ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మాట్లాడతా! అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మా ఎన్నికలపై అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉంటే.. మరోవైపు.. జనరల్ సెక్రటరీ పదవికి మంచు విష్ణు ప్యానల్లో ఉన్న రఘుబాబు గెలిచారు. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. ఇక విష్ణు ప్యానల్ నుంచి మా కోశాధికారిగా శివబాలజీ ఎన్నికయ్యారు.
ట్వీట్..
Good Morning! I am humbled by the love and support my film fraternity has shown to me. Before I say anything more on MAA election; the counting for the EC Members, Joint Secretary and one of the Vice President posts start at 11am today. Will talk after that! ??
— Vishnu Manchu (@iVishnuManchu) October 11, 2021
Also Read: Cruise Drug Case: షారూక్ ఖాన్ కు ఈరోజూ షాక్ తప్పదా? ఆర్యన్ బెయిల్ మార్గం ఇంకా తెరుచుకోలేదా?
Satyajith: సినీ పరిశ్రమలో పెను విషాదం.. ప్రముఖ నటుడు సత్యజిత్ కన్నుమూత..
MAA Elections: ‘మా’ ఎన్నికలపై స్పందించిన బండి సంజయ్.. ట్విట్టర్ వేదికగా ఏం కామెంట్ చేశారంటే..