Maa Elections 2021: ‘మా’ లో పేలుతోన్న మాటల తూటాలు.. రసవత్తరంగా మారిన ఫైట్
'మా' అసోసియేషన్‌లో గట్టిగా లెక్కేస్తే వెయ్యి మంది సభ్యులు కూడా ఉండరు. కానీ ఎలక్షన్ క్యాంపెయిన్, హంగామా, సందడి.. సాధారణ ఎన్నికలు చిన్నబోయేలా చేస్తున్నాయి.
‘మా’ లెటెస్ట్ ఫైట్ రసవత్తరంగా మారింది. విజేత ఫ్రేమ్‌లో గెలిచి నిలిచేదెవరో కానీ.. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల ప్రచారం మాత్రం మాములుగా లేదు. గడువు దగ్గర పడుతున్న కొద్దీ సరికొత్త సవాళ్లు తెరపైకి వస్తున్నాయి. మాటల తూటాలు మంటల్లా ఎగిసిపడుతున్నాయి. ఎవ్వరికి ఎవరూ తగ్గడం లేదు. మాదాకా వస్తే తగ్గేదే లే అంటూ ఎలక్షన్ హీట్‌ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అసోసియేషన్‌లో గట్టిగా లెక్కేస్తే వెయ్యి మంది సభ్యులు కూడా ఉండరు. కానీ ఎలక్షన్ క్యాంపెయిన్, హంగామా, సందడి.. సాధారణ ఎన్నికలు చిన్నబోయేలా చేస్తున్నాయి. ప్యానళ్లు, వర్గాలు, విభేదాలు, ఆరోపణలు, సవాళ్లతో ఫిలింనగర్ వేడెక్కుతోంది. ఆరంభంలోనే బండ్ల గణేష్ యూ టర్న్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా ప్రకాశ్‌రాజ్‌కి మద్దతిచ్చిన గణేష్.. ఆ తర్వాత ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గణేష్ వ్యాఖ్యలపై జీవితా భిన్నంగా స్పందించారు. బండ్లగణేశ్‌తో తనకెలాంటి విభేదాలు లేవన్నారామె. తనపై వ్యతిరేకంగానో, నెగిటివిటీతోనో ఆయన పోటీ చేస్తున్నారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రకాశ్‌రాజ్‌కి మొదట్లో సంపూర్ణ మద్దతు తెలిపిన గణేష్.. ఇప్పుడు మాత్రం టోటల్‌గా రివర్సయ్యాడు. విందు రాజకీయాలపై భగ్గుమన్నారు. కొవిడ్ కాలంలో ఈ మీటింగ్‌లేంటని లాజిక్ లాగాడు. అయితే ప్రకాష్ అండ్ కో కూడా బండ్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అసోసియేషన్స్ ఎన్నికలు అన్నాక అందరితో చర్చలు, క్యాంపెయిన్ చేయడాలు కామన్ అని.. అందులో భాగంగా కొంతమంది ఆర్టిస్ట్ లను లంచ్ కు పిలిచానని.. వారితో సమస్యల గురించి చర్చించామని ప్రకాశ్ రాజ్ అన్నారు. గుజరాత్ తో పాటు మరికొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని.. అక్కడికీ అందరూ వెళ్తున్నారని.. మరి దాని గురించి బండ్ల గణేష్ ఏం మాట్లాడతారని మోనార్క్ ప్రశ్నించారు.
మొత్తంగా ప్రశాంతంగా జరగాల్సిన మా ఎన్నికలు కాస్త రాజకీయంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా హోరాహోరి నెలకొంది. ఈ మధ్య ‘మా’ లో జరుగుతున్న పరిణామాలు.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. మొదట్లో నిధుల గోల్‌మాల్, ఆ తర్వాత ఫండ్ రైజింగ్.. ఆపై బిల్డింగ్ దగ్గర మొదలైన రచ్చ కంటిన్యూ అవుతోంది.
Also Read:రిటైర్మెంట్‌కు ముందు బకాసురుడిగా మారిన తహశీల్దార్.. ఏకంగా 378 ఎకరాల ప్రభుత్వ భూములు ఆన్లైన్
రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్