మా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో మా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకుని..మొదటి ఓటు వేశారు. ఈ సందర్భంగా మా ఎన్నికలపై పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తిప్పి కొడితే 900 ఓట్లు ఉన్నాయి. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా అని ప్రశ్నించారు. సినిమాలు చేసే వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయన్నారు. మా ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇలాంటి పోటీని చూడదలేదని ఆయన తెలిపారు. సినిమా ఇండస్ట్రీ చీలడం అనే సమస్యే ఉండదని పవన్ తేల్చి చెప్పాడు. ఇక మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్న ప్రచారం జరుగుతుందన్నదానిపై పవన్ స్పందిస్తూ.. వారిద్దరు మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు. సినిమాలు చేసేవాళ్లు ఆదర్శంగా ఉండాలని చెప్పుకొచ్చారు పవన్.