Naga Shaurya’s Lakshya: ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ లిరికల్ వీడియో..

యంగ్ హీరో నాగ శౌర్య కెరీర్‌లో లాండ్ మార్క్‌గా రాబోతోన్న 20వ చిత్రం లక్ష్యం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.

Naga Shauryas Lakshya: ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నాగశౌర్య లక్ష్య మూవీ లిరికల్ వీడియో..
Jagapathi Babu

Updated on: Nov 06, 2021 | 8:43 PM

Naga Shaurya: యంగ్ హీరో నాగ శౌర్య కెరీర్‌లో లాండ్ మార్క్‌గా రాబోతోన్న 20వ చిత్రం లక్ష్యం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే థియేటర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుండి ఓ లక్ష్యం లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఓ లక్ష్యం అంటూ సాగే ఈ పాట ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ఈ పాటలో నాగ శౌర్యకు, జగపతి బాబుకు మధ్య ఉన్న బంధం తెలుస్తుంది. నాగ శౌర్య చేతికి గాయం అవ్వడం, జగపతి బాబు వచ్చి తినిపించడం వంటి సీన్లు ఆకట్టుకున్నాయి. జగపతి బాబు పనుల్లోనూ నాగ శౌర్య సాయం చేయడం వంటివి కూడా కనిపిస్తున్నాయి. ఈ పాట చివర్లో కేతిక శర్మ కూడా కనిపిస్తుంది.

సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విలు విద్యలో ఆరితేరిన వాడిలా కనిపించేందుకు నాగ శౌర్య తన శరీరాకృతిని ఎంతగానో మార్చుకున్నారు. కొత్త అవతారంలో నాగ శౌర్య కనిపించబోతోన్నారు. పురాతనమైన ఈ విలు విద్య నేపథ్యంలో రాబోతోన్న ఈ చిత్రంలో రెండు విభిన్న గెటప్పుల్లో నాగ శౌర్య కనిపించబోతోన్నారు. ఈ చిత్రం కోసం నాగ శౌర్య ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puneeth Rajkumar : చిన్నవయసులో అప్పు మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే మనసుకు కష్టంగా ఉంది.. కన్నీటి పర్యంతం అయిన జయప్రద..

Allu Arjun: మరో బిజినెస్ మొదలు పెట్టిన ఐకాన్ స్టార్.. థియేటర్ ఓనర్‌గా అల్లు అర్జున్

Jai Bhim: నేనూ ఇలాంటి దారుణాలు చూశాను.. హైదరాబాద్‌లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి.. ‘జై భీమ్‌’ సినిమాపై ఐఏఎస్ అధికారి స్పందన..