బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి లైగర్(Liger)బరిలోకిన్ దిగనున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 25న లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ పాన్ ఇండియా మూవీతో విజయ్ బాలీవుడ్‌కు అనన్య టాలీవుడ్ కు ఒకే సారి పరిచయం అవుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాయకు కావాల్సినంత బజ్ క్రియేట్ అయ్యింది.
విడుదుల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలతో స్పీడ్ పెంచింది లైగర్ టీమ్. అలాగే ‘లైగర్’ కోసం విస్తృతమైన ప్రమోషన్‌లతో దూసుకుపోతున్నారు టీమ్. ఇప్పటికే ముంబై, పాట్నా ,అహ్మదాబాద్‌లలో ప్రమోషన్స్ తో మోతమోగించారు. దర్శకుడు పూరీ జగన్నాధ్, అనన్య పాండే, విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇతర నగరాల్లో పర్యటించనున్నారు. విజయ్ దేవరకొండ తల్లిగా నటించిన రమ్యకృష్ణ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఆగస్ట్ 11 నుండి ఆగస్టు 23 వరకు పూణే, చండీగఢ్, చెన్నై, బెంగళూరు, కొచ్చి, విజయవాడ, ఇండోర్, వరంగల్, గుంటూరు, ఢిల్లీ ,వారణాసి వంటి నగరాలను కవర్ చేయనున్నారు. విజయ్ దేవరకొండ పాట్నా , అహ్మదాబాద్‌లలో లైగర్ ప్రమోషన్‌లకు భారీ స్పందన వచ్చింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తోందో చూడాలి.
India, team #Liger is coming to your cities to roar in every heart!♥️
The Liger fandom tour schedule is set, are you ready?
Mark your calendars. See you there!#LigerOnAug25th______@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial pic.twitter.com/CsEYsQC0mg
— Dharma Productions (@DharmaMovies) August 9, 2022