AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు పరిశ్రమలో దళపతి జెండా పాతినట్టేనా..? ఫస్ట్ డే రూ.10 కోట్ల క్లబ్‌లో చేరిన విజయ్..!

ఎవరిలో ఇంత సత్తా ఉందో బయటకి వచ్చేవరకు ఎవరికీ ఒక ఐడియా ఉండదు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో అయితే ఏ హీరోకు ఎంత సత్తా ఉంటుంది అనేది వాళ్ళు చేసే సినిమాలను బట్టి ఉంటుంది.. కానీ ఫేస్ వాల్యూని బట్టి కాదు. తాజాగా తమిళ హీరో విజయ్ విషయంలో ఇదే జరుగుతుంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈయన గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అన్నారు.

తెలుగు పరిశ్రమలో దళపతి జెండా పాతినట్టేనా..? ఫస్ట్ డే రూ.10 కోట్ల క్లబ్‌లో చేరిన విజయ్..!
Vijay
Praveen Vadla
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 21, 2023 | 11:24 AM

Share

ఎవరిని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరిలో ఇంత సత్తా ఉందో బయటకి వచ్చేవరకు ఎవరికీ ఒక ఐడియా ఉండదు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో అయితే ఏ హీరోకు ఎంత సత్తా ఉంటుంది అనేది వాళ్ళు చేసే సినిమాలను బట్టి ఉంటుంది.. కానీ ఫేస్ వాల్యూని బట్టి కాదు. తాజాగా తమిళ హీరో విజయ్ విషయంలో ఇదే జరుగుతుంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈయన గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అన్నారు. పోస్టర్ ఖర్చులు కూడా రావు అన్నారు. అసలు ఆ మొహంలో ఎక్స్ప్రెషన్ పలకదు అంటూ ఎన్నో విమర్శలు కూడా చేశారు.

విజయ్ సినిమాలు అసలు తమిళ్ ఆడియన్స్ ఎలా చూస్తున్నారో అంటూ అవమానించారు. యాక్టింగ్ రాదు అంటూ వెక్కిరించారు. మిగిలిన తమిళ హీరోలు అందరూ తెలుగు మార్కెట్ పెంచుకుంటుంటే విజయ్ మాత్రం కేవలం అక్కడే సెటిల్ అయిపోయాడు. అసలు తెలుగు ఇండస్ట్రీ ఒకటి ఉందనే విషయం కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఫస్ట్ టైం శంకర్ తెరకెక్కించిన స్నేహితుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఆ తర్వాత వరుసగా తన సినిమాలను తెలుగులోను విడుదల చేస్తూ వచ్చాడు. 10 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పటికి కానీ ఆయనకు రికార్డు బ్రేకింగ్ మార్కెట్ రాలేదు. ఇప్పుడు తెలుగులో కూడా విజయ్ పెద్ద హీరో. ఆయన సినిమా వచ్చింది అంటే ఇక్కడ కూడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి.

కొన్ని సంవత్సరాలుగా విజయ్ సినిమాలు కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన లియో సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా రూ.16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఒకప్పుడు విజయ్ సినిమాలకు కనీసం 10 కోట్ల కలెక్షన్స్ అయినా వస్తాయా అని అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా మొదటి రోజే 10 కోట్లు షేర్ వసూలు చేసే స్థాయికి ఎదిగాడు విజయ్.

దళపతి రేంజ్ చూసి మిగిలిన హీరోలు కుళ్ళుకుంటున్నారు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన లియో సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.. కానీ మొదటి రోజు తెలుగులోనే 9 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. రెండో రోజు కూడా కలెక్షన్స్ అదిరిపోయాయి. దీనికి ముందు వారసుడు, సర్కార్, విజిల్, అదిరింది లాంటి విజయాలతో తన మార్కెట్ పెంచుకున్నాడు విజయ్. మొత్తానికి రజనీకాంత్, కమల హాసన్, సూర్య, విక్రమ్‌తో పాటు ఇప్పుడు మరో కోలీవుడ్ హీరో తెలుగు సినీ ఇండస్ట్రీలో జెండా పాతినట్టేనన్నా టాక్ వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల్లో..

మరిన్ని సినిమా వార్తలు చదవండి