Lavanya Tripathi: ఇంకెప్పుడు మారుతార్రా అయ్యా!! లావణ్య త్రిపాఠి కులం కోసం తెగ సెర్చ్‌ చేస్తున్న నెటిజన్స్‌

|

Jun 15, 2023 | 5:35 PM

వరుణ్‌ తేజ్‌తో ఎంగేజ్మెంట్‌ తర్వాత లావణ్య పేరు ఒక్కసారిగా నెట్టింట మార్మోగిపోయింది. ఆమె ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తిచూపించారు. అయితే ఎప్పటిలాగే లావణ్యది ఏ కులమో తెలుసుకునేందుకు చాలామంది గూగుల్‌ను ఆశ్రయించారు. దీంతో ఆమె పేరు గూగుల్ ట్రెండింగ్స్ లో టాప్ లో ఉంటోంది.

Lavanya Tripathi: ఇంకెప్పుడు మారుతార్రా అయ్యా!! లావణ్య త్రిపాఠి కులం కోసం తెగ సెర్చ్‌ చేస్తున్న నెటిజన్స్‌
Varun Tej, Lavanya Tripathi
Follow us on

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటికే ఉంగరాలు మార్చుకున్న ఈ లవ్‌ బర్డ్స్‌ మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్నారు. దీంతో చాలామంది ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వరుణ్‌- లావణ్యలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. కాగా వరుణ్‌ తేజ్‌తో ఎంగేజ్మెంట్‌ తర్వాత లావణ్య పేరు ఒక్కసారిగా నెట్టింట మార్మోగిపోయింది. ఆమె ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తిచూపించారు. అయితే ఎప్పటిలాగే లావణ్యది ఏ కులమో తెలుసుకునేందుకు చాలామంది గూగుల్‌ను ఆశ్రయించారు. దీంతో ఆమె పేరు గూగుల్ ట్రెండింగ్స్ లో టాప్ లో ఉంటోంది. అయితే ఇలా వ్యక్తుల కులాలు, మతాల గురించి సోషల్‌ మీడియాలో సెర్చ్‌ చేయడం, చర్చించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మారాలని హితవు పలుకుతున్నారు

లోకస్‌భ స్పీకర్‌కే చురకలు..

లావణ్య త్రిపాఠిది ఉత్తర ప్రదేశ్. ఆమె తండ్రి హైకోర్టు లాయర్‌ కాగా తల్లి ఓ స్కూల్‌ టీచర్‌. ఇక అందాల రాక్షసికి ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. కాగా లావణ్యకు కులాల పట్టింపులేమీ పెద్దగా పట్టవు. దీనికి నిదర్శనం గతంలో ఆమె చేసిన ఒక ట్వీట్‌. 2019లో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా బ్రాహ్మణులను ఉద్దేశిస్తూ ‘భారత సమాజంలో బ్రాహ్మణులు ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉంటారు. వారి త్యాగాల ఫలితంగా వచ్చిన హోదా ఇది. బ్రాహ్మణులు సమాజానికి మార్గదర్శకులుగా ఉన్నత పాత్ర పోషిస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఇది లావణ్యకు ఏ మాత్రం నచ్చలేదు. వెంటనే బిర్లా ట్వీట్‌ పై స్పందించింది ‘కొందరు బ్రాహ్మణుల్లో తాము అధికులమేనే భావన ఎందుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. మనం చేసే పనులను బట్టి ఉన్నతులో, తుచ్చులో అవుతారు. మన కులాన్ని బట్టి కాదు’ అని ట్వీట్‌ చేసింది. దీనిపై చాలామంది ఆమెను మెచ్చుకున్నారు. అదే సమయంలో బ్రాహ్మణ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడ్డారు. దీంతో వివాదం మరింత పెద్దది కాకుండా ఉండేందుకు తన ట్వీట్‌ను డిలీట్‌ చేసింది లావణ్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..