
రాజ్‌తరుణ్ తల్లిదండ్రులను కోకాపేటలోని ఇంట్లోకి రానిచ్చేందుకు లావణ్య అంగీకరించడంతో హైడ్రామాకు తెరపడిందని బావించారు. కానీ వివాదానికి ఫుల్ స్టాప్ కాదు.. కామానే అంటూ మరో యాక్షన్ పార్ట్ తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్‌లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని తన ఫిర్యాదులో లావణ్య ఆరోపించారు. తనపై కుట్ర జరుగుతోందని.. రాజ్‌తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న లావణ్య.. రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రాజ్ తరుణ్‌తోపాటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, శేఖర్ బాషా, ప్రీతీ సహా మరికొంత మందిపై ఫిర్యాదు చేశారు లావణ్య.
కోకాపేట్‌లోని విల్లా రాజ్‌తరుణ్‌దేనంటూ.. అతని తల్లిదండ్రులు నిన్నంతా ఆ ఇంటిముందు నిరసన చేశారు. తమ కుమారుడి ఇంట్లోనే ఉంటామంటూ లావణ్యతో గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు.. రాజ్‌తరుణ్ పేరెంట్స్‌ను ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు స్పష్టం చేశారు. దీంతో గత అర్ధరాత్రి వారిని ఇంట్లోకి అనుమతించారు లావణ్య.
ఇవి కూడా చదవండి :