సినిమా చేయనని డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన జయప్రకాష్ రెడ్డి.. కానీ చివరకు

నటుడు జయప్రకాష్ రెడ్డి గురించి తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. నటుడిగా, విలన్ గా, కమెడియన్ గా తన నటనతో ప్రేక్షకులను అలరించారు. జయప్రకాష్ రెడ్డి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ..

సినిమా చేయనని డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన జయప్రకాష్ రెడ్డి.. కానీ చివరకు
Jayaprakash Reddy

Updated on: Apr 11, 2026 | 9:05 PM

ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు ఇలా ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ప్రేక్షకుల మన్నలను అందుకున్నాడు నటుడు జయప్రకాశ్ రెడ్డి. కేవలం విలన్ గానే కాదు తన కామెడీతో నవ్వులు పూయించారు ఆయన. టాలీవుడ్ లో స్టార్ గా ఓ వెలుగువెలిగిన ఆయన 2020 న కన్నుమూశారు. కాగా గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీను వైట్లతో తన నటనా ప్రయాణం, కెరీర్‌లో కీలక మలుపులు గురించి పంచుకున్నారు. ఆయన మొదట్లో చిన్న చిన్న వేషాలను తిరస్కరించా. శ్రీను వైట్ల లాంటి దర్శకుడితో వన్-డే పాత్రల్లో నటించడానికి తాను సుముఖంగా లేనని చెప్పేవారట.

అప్పట్లో ఊపేసిన నాగమ్మ సీరియల్‌.. నాగదేవతగా చేసిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

శ్రీను వైట్ల మొదటి సినిమా నీ కోసంలో తాను మెయిన్ క్యారెక్టర్ చేశానని, రవితేజ హీరోగా నటించిన ఆ చిత్రంలో తాను హీరోయిన్ ఫాదర్ లేదా ప్రధాన విలన్ పాత్రను పోషించానని జయప్రకాష్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. నీ కోసం తర్వాత ఆనందం అనే సినిమాలో నటించానని . ఆనందంలో కేవలం రెండు సీన్ల పాటు వచ్చే ఒక పోలీసు పాత్రను పోషించా.. ఆ పాత్రలో గోదావరి స్లాంగ్‌తో కూడిన కామెడీ సీన్స్ పెద్ద హిట్ అయ్యాయని, అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన తెలిపారు. ఆనందం తర్వాత శ్రీను వైట్ల నుంచి మళ్లీ వన్-డే పాత్రల కోసం పిలుపు వచ్చిందని, ఒకటి రెండు చిత్రాలలో అంగీకరించినా, మూడవసారి వన్-డే పాత్రను తిరస్కరించినట్లు జయప్రకాష్ రెడ్డి చెప్పారు.

రఘువరన్ చివరి రోజుల్లో అంత బాధను అనుభవించారా.! మద్యానికి బానిసై చివరకు

మొదటి సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత నన్ను వన్-డేకి పరిమితం చేశారు. అంటే మెయిన్ వేషాలు నేను చేయలేనా. పనికి రానా. చేయించుకోలేరా నా చేత. మొదటి సినిమాకే చేయించుకున్నారు, తర్వాత మీకు ఏంటి భయం” అని ప్రశ్నిస్తూ తాను ఆ పాత్రలు చేయనని తెగేసి చెప్పినట్లు తెలిపారు జయప్రకాష్ రెడ్డి. ఎవరు హీరో, ఎవరు ప్రొడ్యూసర్ అని కూడా తెలియకుండానే ఆ అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు. ఆ తర్వాత, శ్రీను వైట్ల ఢీ సినిమా కోసం జయప్రకాష్ రెడ్డిని సంప్రదించారట. అంకుల్ మనం ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయబోతున్నాం అని శ్రీను వైట్ల చెప్పగా, ఛాలెంజ్ అంటే తనకు ఇష్టమని, తప్పకుండా చేద్దామని జయప్రకాష్ రెడ్డి అంగీకరించారట. ఆ పాత్ర గురించి వివరిస్తూ, నోట మాట లేదు, ఓన్లీ ఎక్స్‌ప్రెషన్, సినిమా మొత్తం ఉంటావు” అని శ్రీను వైట్ల తెలిపినట్లు జయప్రకాష్ రెడ్డి చెప్పారు. ఇది తన కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అని, నిజంగా అది ఒక డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్ అని ఆయన పేర్కొన్నారు. తాను సాధారణంగా డైలాగ్ కింగ్గా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఢీ సినిమాలో ప్రతి సీన్‌లో ఉంటూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కేవలం హావభావాలతో నటించడం ఒక వినూత్న అనుభవమని అన్నారు.

ఇవి కూడా చదవండి

అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్.. టాలీవుడ్‌లో తోప్.. ఎవరో గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us