Aditya Om : లాహిరీ లాహిరీ లాహిరీలో హీరో గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు.. త్వరలో బిగ్ బాస్‌లోకి..

|

Aug 10, 2024 | 8:55 PM

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీస్ లో లాహిరి లాహిరి లాహిరీలో కూడా ఒకటి. వైవీ‌ఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర టైనర్ లో నందమూరి హరికృష్ణ, సుమన్, వినీత్, భానుప్రియ, అంకిత ప్రధాన పాత్రల్లో కనిపించారు. వీరితో పాటు హీరోయిన్ అంకిత ప్రియుడిగా ఆదిత్య ఓం నటించాడు. అతనికి ఇదే మొదటి సినిామా.

Aditya Om : లాహిరీ లాహిరీ లాహిరీలో హీరో గుర్తున్నాడా? ఇప్పుడేంటిలా మారిపోయాడు.. త్వరలో బిగ్ బాస్‌లోకి..
Hero Aditya Om
Follow us on

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీస్ లో లాహిరి లాహిరి లాహిరీలో కూడా ఒకటి. వైవీ‌ఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర టైనర్ లో నందమూరి హరికృష్ణ, సుమన్, వినీత్, భానుప్రియ, అంకిత ప్రధాన పాత్రల్లో కనిపించారు. వీరితో పాటు హీరోయిన్ అంకిత ప్రియుడిగా ఆదిత్య ఓం నటించాడు. అతనికి ఇదే మొదటి సినిామా. అయినా ఎంతో ఎనర్జిటిక్ గా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ధనలక్ష్మీ ఐ లవ్ యు, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ప్రేమించుకున్నాం పెళ్లికి రెడీ, భామ కలాపం, ఆఖరి పేజీ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు. అలాగే స్క్రీన్ ప్లే, పాటల రచయిత, దర్శకుడిగా.. నిర్మాతగానూ మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకున్నాడు. అయితే చాలా మంది హీరోల్లాగే ఆదిత్య ఓం కూడా కెరీర్ ను సరైన దిశలో ప్లాన చేసుకోలేకపోయాడు. ఫలితంగా అవకాశాలు సన్నగిల్లాయి. క్రమక్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే గతేడాది మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దహనం, అమరం, నాతో నేను, ఎర్రగుడి.. ఇలా ఆదిత్య ఓం నటించిన నాలుగు సినిమాలు గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో దహనం సినిమాకు గానూ అవార్డులు, ప్రశంసలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఆదిత్య ఓం త్వరలో బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టబోతున్నాడని సమాచారం. దీనికి సంబంధించి జబర్దస్త్ కమెడియన్ మహిధర్ ఇటీవల ఒక హింట్ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కొంత మంది కంటెస్టెంట్ల పేరును వెల్లడించాడు. అందులో నటుడు ఆదిత్య ఓం పేరు కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అగ్రిమెంట్స్ ఫైనల్ కాలేదని సమాచారం. ఆదిత్య ఓంతో పాటు లాహిరి లాహిరి లాహిరీలో హీరోయిన్, రస్నా బేబీ అంకితను కూడా హౌజ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. అధికారిక సమాచారం తెలియాలంటే బిగ్ బాస్ షో లాంచింగ్ డే వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆదిత్య ఓం లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.