L2: Empuraan : ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్.. ఎంపురాన్ బాక్సాఫీస్ ఊచకోత..
ఓవైపు వివాదాలు.. మరోవైపు భారీ వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది మోహన్ లాల్ ఎంపురాన్ సినిమా. ఇప్పటికే హీరో మోహన్‌లాల్‌కు తమిళనాడు రైతులు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంపురాన్ మూవీలో 12 సీన్లను తొలగించాలని అల్టిమేటమ్ ఇచ్చారు. లేదంటే ఇళ్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇంతకీ ఎంపురాన్ మూవీలో ఏముంది? రైతులకు ఆగ్రహం తెప్పించిన సీన్లేంటి?

ముళ్ల పెరియార్ డ్యామ్… ఇదో విచిత్రమైన డ్యామ్. ఉన్నది కేరళలో.. అవసరం తమిళనాడుది. యజమాన్యం కేరళ అయినా.. నిర్వహణ మాత్రం తమిళనాడుది. అందుకే.. రెండు రాష్ట్రాల మధ్య ఈ డ్యామ్ ఏళ్ల తరబడి మంట పుట్టిస్తూనే ఉంటుంది. ఇప్పుడా మంటకు ఆజ్యం పోసింది ఎంపురాన్ మూవీ. మోహన్‌లాల్ నటించిన ఈ సినిమాలో.. డ్యామ్‌కి సంబంధించిన సీన్లపై తమిళనాడు రైతాంగం భగ్గుమంటోంది. ముళ్ల పెరియార్ డ్యామ్ వందేళ్లకు పైబడిందని.. ఇది ఎప్పటికైనా ప్రమాదమేనంటోంది కేరళ. అలాగే నీటిమట్టం తగ్గించాలంటోంది. వానలు వరదలొస్తే డ్యామ్ కిందనున్న గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ఎంపురన్ మూవీలో ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. డ్యామ్‌కి సేఫ్టివాల్ నిర్మించాలని కొన్ని సీన్లలో ప్రస్తావించారు. దీనిపై తేని, మధురై, శివగంగ జిల్లాకు చెందిన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం 12 సీన్లు తొలగించాల్సిందేనని.. లేదంటే హీరో మోహన్‌లాల్, నిర్మాతల ఇళ్లు, కంపెనీలపై దాడులు చేస్తామని హెచ్చరించారు.
ముళ్ల పెరియార్ డ్యామ్‌పై కేరళ ఆందోళన వ్యక్తం చేయడం.. దాన్ని తమిళనాడు కొట్టిపడేయడం ఏళ్లుగా జరుగుతూనే ఉంది. కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. అయితే సినిమాల్లో డ్యామ్ ప్రస్తావన తీసుకురావడం వివాదాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్తోంది. గతంలో డ్యామ్ 999 మూవీలో రిజర్వాయర్ బద్దలైతే ఊళ్లకు ఎలాంటి ప్రమాదమో చూపించే ప్రయత్నం చేశారు. ఈ మూవీపై అప్పట్లో ఆందోళనలు మిన్నంటాయి.
ఇదిలా ఉంటే.. పృథ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా 200 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. 5 రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో అటు వరుస వివాదాలు వస్తున్నప్పటికీ ఎంపురాన్ సినిమా క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.
The OVERLORD shatters the 200 crore barrier in style! EMPURAAN makes history!#L2E #Empuraan pic.twitter.com/9xQb2CWiV5
— Mohanlal (@Mohanlal) March 31, 2025
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..