Kriti Sanon: బాబోయ్.. ఈ అమ్మాడి రేంజ్ చూస్తే మైండ్ బ్లాంకే.. ఎన్ని కోట్లకు వారసురాలో తెలుసా ?..
1990 జూలై 27న న్యూఢిల్లీలో జన్మించింది కృతి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన ఆమె.. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2014లో మహేష్ సరసన వన్ నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హీరోపంతి సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో కృతికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్.. ఛాలెంజింగ్ పాత్రలు పోషిస్తూ ప్రశంసలు అందుకుంది. బరేలీకి బర్ఫీలోని అల్లరి అమ్మాయిగా కనిపించిన ఈ బ్యూటీ ఇటీవల మిమీ సినిమాలో ధైర్యవంతురాలైన తల్లిగా కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. కానీ హిందీ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి.
1990 జూలై 27న న్యూఢిల్లీలో జన్మించింది కృతి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన ఆమె.. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2014లో మహేష్ సరసన వన్ నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హీరోపంతి సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2021లో కృతి నటించిన మిమి సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఇందులో కృతి నటనకు విమర్శకులే ఫిదా అయ్యారు. ఇందులో ఆమె నటకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది.
నివేదికల ప్రకారం కృతిసనన్ నికర విలువ రూ.82 కోట్లు. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీ 100 జాబితాలో చోటు దక్కించుకుంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా దేశంలోని కొన్ని అతిపెద్ద బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్. సంవత్సరానికి రూ. 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది. ప్రతి సినిమాకు రూ. 5 నుంచి రూ. 6 కోట్లు వరకు వసూలు చేస్తుంది. ఇటీవల ఆదిపురుష్ సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుందని టాక్. అలాగే షెహజాదా సినిమాకు రూ. 5 కోట్లు తీసుకుందట.
కృతికి D2C అనే చర్మ సంరక్షణ బ్రాండ్ వ్యాపారం ఉంది. Ms టేకెన్ అనే ఫ్యాషన్ లేబుల్‌ను కూడా కలిగి ఉంది . అలాగే ట్రింగ్ అనే టెక్ స్టార్టప్‌లో ప్రధాన పెట్టుబడిదారురాలు. కృతి తన సోదరి నూపూర్ సనన్‌తో కలిసి బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
