మన దగ్గర ఉన్న ముద్దుగుమ్మలు సినిమాల్లో నటిస్తూనే పలు ఛారిటీలు కూడా నడిపిస్తూ ఉంటారు. అందంతో పాటు అంతే అందమైన మనసు కూడా ఉందని నిరూపించుకుంటూ ఉంటారు. అందాల భామలు చాలా మంది ఇప్పటికే సినిమా తారలు తమ సేవా గుణంతో అభిమానులను పెంచుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty)కూడా జాయిన్ అయ్యారు. ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. ఉప్పెన సినిమా మంచి విజయం సాధించడంతో ఈ చిన్నదానికి టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఉప్పెన సినిమా తర్వాత నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో అలాగే నాగ చైతన్య నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో హిట్స్ అందుకుంది.
ఆ తర్వాత వచ్చిన నితిన్ మాచర్ల నియోజక వర్గం, రామ్ పోతినేని వారియర్, అలాగే రీసెంట్‌గా సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం తమిళ్‌లో సినిమా చేస్తోంది బేబమ్మ. సూర్య బాల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా తన పుట్టిన రోజు సందర్భంగా.. కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం చేయడానికి ఓ స్వచ్చంద సంస్థను ప్రారంభించింది. ‘నిష్న – ఫీడ్ ది నీడ్’ అనే పేరుతో ఎన్జీవోను మొదలుపెట్టింది. సాయం చేయాలనే ఆలోచనలో ఎన్జీవోను స్టార్ట్ చేసినట్లు తెలిపింది. అందరూ తమ సంస్థకు అండగా నిలవాలని కోరింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.