Krishnam Raju: కృష్ణంరాజు స్వగ్రామం మొగల్తూరులో సంస్మరణ సభ.. ప్రభాస్ సహా కుటుంబ సభ్యులు హాజరు..

ఈనెల 11 మరణించిన కృష్ణం రాజు కన్నుమూశారు. హైదరాబాద్ లో దశదిన కర్మ అనంతరం.. కృష్ణంరాజుకి ఇష్టమైన ఆయన స్వగ్రామం మొగల్తూరులో ఈరోజు కుటుంబ సభ్యులు సంస్మరణ సభను నిర్వహిస్తున్నారు

Krishnam Raju: కృష్ణంరాజు స్వగ్రామం మొగల్తూరులో సంస్మరణ సభ.. ప్రభాస్ సహా కుటుంబ సభ్యులు హాజరు..
Krishnam Raju

Updated on: Sep 29, 2022 | 11:04 AM

Krishnam Raju: మాజీ కేంద్ర మంత్రి, టాలీవుడ్ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభను నేడు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహిస్తున్నారు. కృష్ణంరాజు స్వగృహంలో ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నఆయన ఈనెల 11 మరణించిన సంగతి తెలిసిందే.  దశదిన కర్మ అనంతరం.. కృష్ణంరాజుకి ఇష్టమైన ఆయన స్వగ్రామం మొగల్తూరులో ఈరోజు కుటుంబ సభ్యులు సంస్మరణ సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభాస్ సహా ఫ్యామిలీ సభ్యులు మొగల్తూరు చేరుకున్నారు.

ఈ సంస్మరణ సభకు మంత్రులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, సినీ హీరో ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామల, కుమార్తెలు, ఆయన అభిమానులు హాజరుకానున్నారు. దాదాపు లక్ష మంది పైగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులు సభకు వచ్చే వారందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. కృష్ణం రాజు భోజన ప్రియుడు కనుక ఆయనకు ఇష్టమైన వంటకాలతో భారీగా వంటకాలను రెడీ చేశారు. 25 రకాల వంటకాలతో వెజ్, నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు.  ముఖ్యఅతిథులకు కృష్ణం రాజు ఇంటి ఆవరణలో ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారందరికీ కృష్ణంరాజు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు. రద్దీని నియంత్రించేందికు పోలీసులు సిబ్బందిని, వాలంటీర్లను నియమించారు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..