AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranga Marthanda movie review: రంగమార్తాండ ఫుల్ రివ్యూ.. కృష్ణవంశీ మార్క్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా..

మరాఠిలో సంచలన విజయం సాధించిన నట సామ్రాట్ సినిమాను తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేసారు కృష్ణవంశీ. చాలా రోజులుగా ఇండస్ట్రీలో సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం ఉగాది రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Ranga Marthanda movie review: రంగమార్తాండ ఫుల్ రివ్యూ.. కృష్ణవంశీ మార్క్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా..
Rangamarthanda
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2023 | 3:58 PM

Share

మూవీ రివ్యూ: రంగమార్తాండ

నటీనటులు: ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, భద్రం తదితరులు

సంగీతం : ఇళయరాజా

ఎడిటింగ్ : పవన్ వికె

సినిమాటోగఫ్రీ : రాజ్ నల్లి

దర్శకత్వం : కృష్ణవంశీ

నిర్మాతలు : మధు కాలిపు, ఎస్.వెంకట్ రెడ్డి

మరాఠిలో సంచలన విజయం సాధించిన నట సామ్రాట్ సినిమాను తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేసారు కృష్ణవంశీ. చాలా రోజులుగా ఇండస్ట్రీలో సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం ఉగాది రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ హిట్ కొట్టాడా లేదా అనేది చూద్దాం..

కథ : రంగమార్తాండ రాఘవరావు ( ప్రకాష్ రాజ్) ప్రముఖ రంగస్థల నటుడు. ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కూడా తన సేవలు కేవలం నటనారంగానికి మాత్రమే చెందాలని అక్కడికి వెళ్లకుండా ఉండిపోతాడు. ఆయనకు స్నేహితుడు, గురువు అన్ని చక్రవర్తి (బ్రహ్మానందం). ఓ వయసు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతాడు రాఘవరావు. అలా రిటైర్ అయిన వెంటనే తన ఆస్తులను కూతురు, కొడుకులకు పంచేస్తాడు రాఘవరావు. తనకంటూ ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా పూర్తిగా వాళ్లకు ఇచ్చేస్తాడు. అయితే ఆ తర్వాత ఏమైంది..? కొడుకు, కూతురు దగ్గర కూడా తన భార్య రాజు గారు (రమ్యకృ‌ష్ణ)తో కలిసి రాఘవరావు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు..? అసలు రాజులా బతికిన రాఘవరావు చివరికి రోడ్ల పక్కన డాబాల్లో ప్లేట్లు కడుక్కునే స్థాయికి ఎలా దిగజారిపోయాడు.. అసలు ఆయన జీవితంలో ఏం జరిగింది అనేది అసలు కథ..

కథనం: నేనొక నటున్ని అంటూ మెగాస్టార్ చిరంజీవి గంభీరమైన స్వరంతో సినిమా మొదలవ్వగానే.. కృష్ణవంశీ కచ్చితంగా ఈ సారి ఏదో మంచి సినిమానే చూపించబోతున్నాడనే భావన ఆడియన్స్ మదిలో కలుగుతుంది. నేనొక నటుణ్ని అనే వాయిస్ ఓవర్‌పై తెలుగు ఇండస్ట్రీలో ఉన్న లెజండరీ యాక్టర్స్ అందరినీ చూపించాడు కృష్ణవంశీ. ఆ తర్వాత ఇది అమ్మ నాన్నల కథ అంటూ వాళ్ల గొప్పతనం గురించి సాగుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా రాఘవరావు.. అతడి నాటకాలు, స్నేహితుడు చక్రవర్తి మధ్య ఉండే రిలేషన్‌తోనే సాగిపోతుంది. మధ్యలో రాహుల్, శివాత్మిక ట్రాక్ కూడా బాగుంటుంది. అనసూయ భరద్వాజ్‌, కుటుంబం మధ్య సన్నివేశాలు కూడా ప్రతీఇంటిని గుర్తు చేస్తుంటాయి. పెళ్లాం మాటలు కాదనలేక.. తల్లిదండ్రుల్ని వదులుకోలేక కొడుకులు ఎంత ఇబ్బంది పడతారనే విషయాన్ని ఆదర్శ్ పాత్రతో చక్కగా చూపించాడు కృష్ణవంశీ. అలాగే ఈ తరం టిపికల్ కోడల్లు ఎలా ఉన్నారనే పాత్రను అనసూయలో చూపించాడు ఈ దర్శకుడు. ఫస్టాఫ్ అంతా నమ్ముకున్న కొడుకు పూర్తిగా నట్టేటా ముంచడంతో.. రోడ్డున పడ్డ రాఘవరావు కథను చూస్తాం. ఇక కీలకమైన సెకండ్ హాఫ్‌లో కూతురు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా కొన్ని రోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మళ్లీ సమస్యలు మొదలవ్వడంతో.. చివరికి ఊరికి బయల్దేరుతారు రాఘవరావు సతీ సమేతంగా. ఆ ప్రయాణం ఎంత ఎమోషనల్‌గా ముగిసింది అనేది కృష్ణవంశీ చాలా హృద్యంగా చూపించాడు. అమ్మానాన్నల కథతో ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చినా కూడా రంగమార్తండ మాత్రం కాస్త ప్రత్యేకమే. ఇందులో ఓ సోల్ ఉంటుంది. కమర్షియల్ అంశాలు తక్కువగానే ఉన్నా చూస్తున్నపుడు మాత్రం కచ్చితంగా కన్నీరు పెట్టించే సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో బ్రహ్మానందం , ప్రకాష్ రాజ్ మధ్య హాస్పిటల్ సన్నివేషాలు అద్భుతంగా కుదిరాయి. మంచి మూవెంట్స్ కోసం రంగమార్తండ హాయిగా ఓ సారి చూడొద్దు..

నటీనటులు: రంగమార్తాండ పూర్తిగా యాక్టర్స్ ఫిల్మ్. ఇందులో రాఘవ రావు పాత్రలో ప్రకాష్ రాజ్ నటించడం కాదు జీవించేశారు. చాలా రోజుల తర్వాత ఆయన నట విశ్వరూపం ఇందులో కనిపించింది. ఇక బ్రహ్మనందంకు లైఫ్ టైమ్ కారెక్టర్ దొరికింది. ఇందులో ఆయన పోషించిన చక్రవర్తి పాత్ర చిరకాలం గుర్తుండిపోతుంది. రమ్యకృష్ణ కూడా మొదట్నుంచీ సైలెంట్‌గానే ఉన్నా.. చివర్లో ఒకే ఒక్క సన్నివేశంతో అందర్నీ కంటతడి పెట్టించారు. ఇక మిగిలిన పాత్రల్లో ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా , అనసూయ, శివాత్మిక రాజశేఖర్ ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం: ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ముఖ్యంగా పాటలు అంత బాగా కుదర్లేదు. అయితే సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కృష్ణవంశీ గత సినిమాలతో పోలిస్తే ఈ సారి తక్కువ క్వాలిటీ కనిపించింది. నిర్మాతలు మధు,వెంకట్ రెడ్డి మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు. కృష్ణవంశీ దర్శకుడిగా చాలా ఏళ్ళ తర్వాత తన పనితనం చూపించారు.

పంచ్ లైన్: రంగమార్తాండ.. కృష్ణవంశీ మార్క్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా..