Krishna Statue: సొంతూరులో ఘనంగా కృష్ణ విగ్రహావిష్కరణ.. హాజరైన కుటుంబ సభ్యులు, రాజకీయనేతలు..

| Edited By: Surya Kala

Aug 05, 2023 | 1:31 PM

మేలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేశారు. అయితే అనివార్య కారణాలతో విగ్రహావిష్కరణ సాధ్యం కాలేదు. విగ్రహావిష్కరణ జాప్యం అవుతుండటంతో కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు అభిమాన సంఘాలతో మాట్లాడి ఈ రోజు విగ్రహాష్కరణ ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణకు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు కృష్ణ కుటుంబ సభ్యులు తరలి వచ్చారు.

Krishna Statue: సొంతూరులో ఘనంగా కృష్ణ విగ్రహావిష్కరణ.. హాజరైన కుటుంబ సభ్యులు, రాజకీయనేతలు..
Krishna Statue
Follow us on

తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటుడు కృష్ణ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెంలో మొదటిసారి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ జరిగింది.  బుర్రిపాలెం బుల్లోడుగా కృష్ణకు పేరుంది‌. గత ఏడాది నవంబర్ 15 తేదిన ఆయన చనిపోయిన తర్వాత స్వంత ఊర్లో విగ్రహావిష్కరణ చేయాలని అభిమానులు భావించారు. మేలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేశారు. అయితే అనివార్య కారణాలతో విగ్రహావిష్కరణ సాధ్యం కాలేదు.

విగ్రహావిష్కరణ జాప్యం అవుతుండటంతో కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు అభిమాన సంఘాలతో మాట్లాడి ఈ రోజు విగ్రహాష్కరణ ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణకు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు కృష్ణ కుటుంబ సభ్యులు తరలి వచ్చారు.

కృష్ణ ముగ్గురు కుమార్తెలు, అల్లుడు సుధీర్, సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు అచ్చిరెడ్డి, మల్లయ్య, మంత్రి మేరుగ నాగార్జున, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్, మాజీ ఎమ్మెల్యే, స్పీకర్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. మొదటి విగ్రహావిష్కరణ కావటంతో అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..