Kotabommali PS OTT : ఓటీటీలోకి వచ్చేసిన కోటబొమ్మాళి పీస్.. ఎక్కడ చూడొచ్చంటే

|

Jan 11, 2024 | 9:00 AM

ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. థ్రిల్లర్ సస్పెన్స్ గానే కాకుండా ఎమోషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ , శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ కానిస్టేబుల్స్ గా నటించి మెప్పించారు. కోటబొమ్మాళి పీఎస్ సినిమా మలయాళ సూపర్ హిట్ చిత్రం “నాయట్టు” కి రీమేక్ గా తెరకెక్కింది.

Kotabommali PS OTT : ఓటీటీలోకి వచ్చేసిన కోటబొమ్మాళి పీస్.. ఎక్కడ చూడొచ్చంటే
Kotabommali Ps
Follow us on

హీరో శ్రీకాంత్ , శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కోటబొమ్మాళి పీఎస్. ఇటీవలే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. థ్రిల్లర్ సస్పెన్స్ గానే కాకుండా ఎమోషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ , శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ కానిస్టేబుల్స్ గా నటించి మెప్పించారు. కోటబొమ్మాళి పీఎస్ సినిమా మలయాళ సూపర్ హిట్ చిత్రం “నాయట్టు” కి రీమేక్ గా తెరకెక్కింది. దర్శకుడు తేజ మార్ని ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నారు.

కోటబొమ్మాళి పీస్ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు వసూళ్లను కూడా భారీగానే రాబట్టింది. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఓటీటీలోనూ కోటబొమ్మాళి పీఎస్ కు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కోటబొమ్మాళి పీఎస్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

కోటబొమ్మాళి పీఎస్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది.  ఫ్యన్సీ రేటుకు కోటబొమ్మాళి పీఎస్ సినిమాను ఆహా దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచింది ఆహా. ఈరోజు  (జనవరి 11) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది ఆహా. మరి కోటబొమ్మాళి సినిమా ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి. గీతా ఆర్ట్స్ 2  బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు రంజన్ రాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని లింగిడి లింగిడి అనే సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.