AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth - Lal Salaam: సంక్రాంతి రేస్‌ నుంచి రజినీ అవుట్.! మరో రిలీజ్ డేట్..?

Rajinikanth – Lal Salaam: సంక్రాంతి రేస్‌ నుంచి రజినీ అవుట్.! మరో రిలీజ్ డేట్..?

Anil kumar poka
|

Updated on: Jan 11, 2024 | 9:08 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. ఈ సినిమాకు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాలను రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ ఈసినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. ఈ సినిమాకు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాలను రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ ఈసినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. కాసేపటి క్రితం విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పోస్టర్‌ను విడుదల చేసింది.

‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీకాంత్ నటిస్తోన్న సినిమా కావటంతో ‘లాల్ సలామ్’పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అదీ కాకుండా ఆయన బాషా చిత్రం తర్వాత ముంబై బ్యాక్ డ్రాప్‌లో చేసిన సినిమా ఇది.ఇందులో ఆయన మెయినుద్దీన్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ముందుగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల లాల్ సలామ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం లేదు. కొన్ని వారాల క్రితమే డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని చిత్ర దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. లాల్ సలామ్ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow Us