సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్‌ నిర్మాత గుండె పోటుతో మృతి

కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ ప్రొడ్యూసర్‌ ఎస్‌ఏ రాజకణ్ణు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిర్మాత రాజకణ్ణు చెన్నైలోని ఆయన నివాసంలో బుధవారం తెల్లవారుఝామున..

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్‌ నిర్మాత గుండె పోటుతో మృతి
Producer SA Rajkannu

Updated on: Jul 13, 2023 | 11:18 AM

కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ ప్రొడ్యూసర్‌ ఎస్‌ఏ రాజకణ్ణు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిర్మాత రాజకణ్ణు చెన్నైలోని ఆయన నివాసంలో బుధవారం తెల్లవారుఝామున గుండె పోటుతో మృతి చెందారు. దీంతో తమిళ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. నిర్మాత ఎస్‌ఏ రాజకణ్ణు మృతి పట్ల కమల్ హాసన్‌, రాదికా శరత్‌కుమార్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు భారతీరాజా సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. 16 వయదినిలే మువీతో దర్శకుడిగా నా జీవితంలో దీపం వెలిగించిన ఎస్‌ఏ రాజకణ్ణు మరణం నాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెల్పుతున్నానని ట్వీట్‌ చేశారు. దర్శకుడు భారతీరాజా దర్శకత్వంలో కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ’16 వాయదినిలే’ సినిమాతో పాటు తమిళంలో ఎన్నో హిట్‌ మువీలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. కమల్‌ హాసన్‌తోనే దాదాపు 16 చిత్రాలు నిర్మించారు. ముఖ్యంగా ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘కన్నీ పరువుతిలే’, ‘వాలిబామే వా వా’, ‘ఎంగ చిన్న రాస’, ‘మహానది’ వంటి సినిమాలు తమిళనాట సూపర్ హిట్‌ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.