AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Appu Kutty: ఎంత మంచి వాడివయ్యా! తాను చదివిన స్కూల్ కోసం కమెడియన్ భారీ విరాళం.. ఎన్ని లక్షలో తెలుసా?

ప్రముఖ తమిళ కమెడియన్ అప్పుకుట్టి గొప్ప మనసు చాటుకున్నాడు. తాను చదివిన పాఠశాలకు ఏకంగా రూ.11 లక్షలు విరాళం ఇచ్చి అక్కడి విద్యార్థుల కళ్లల్లో వెలుగులు నింపాడు. వివరాల్లోకి వెళితే.. అప్పుకుట్టి స్వస్థలం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నాథన్‌ కినరు

Appu Kutty: ఎంత మంచి వాడివయ్యా! తాను చదివిన స్కూల్ కోసం కమెడియన్ భారీ విరాళం.. ఎన్ని లక్షలో తెలుసా?
Appu Kutty
Basha Shek
|

Updated on: May 13, 2024 | 6:24 PM

Share

ప్రముఖ తమిళ కమెడియన్ అప్పుకుట్టి గొప్ప మనసు చాటుకున్నాడు. తాను చదివిన పాఠశాలకు ఏకంగా రూ.11 లక్షలు విరాళం ఇచ్చి అక్కడి విద్యార్థుల కళ్లల్లో వెలుగులు నింపాడు. వివరాల్లోకి వెళితే.. అప్పుకుట్టి స్వస్థలం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నాథన్‌ కినరు. ఆ ప్రాంతంలోని ముత్తారమ్మన్‌ ఆలయంలో జరుగుతున్న సంబరాలకు అప్పుకుట్టి హాజరయ్యాడు. ఇదే వేడుకల సందర్భంగా నాథన్‌ కినేరులోని తాను చదువుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కూడా వెళ్లాడు. అక్కడి గ్రామ ప్రజల కోరిక మేరకు రూ. 11 లక్షల ఖర్చుతో కంప్యూటర్లు,టేబుల్స్, టీవీ, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, తదితర విద్యా సామాగ్రిని కొని పాఠశాలకు అందజేశాడు. ‘నేను ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి, రెండు తరగతులు చదివాను. అయితే ఇక్కడ కనీస వసతులు లేవని నా దృష్టికి వచ్చింది. ఈ కారణంగానే పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగానే ఉందని తెలిసింది. గ్రామ ప్రజలు, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పాఠశాలకు అవసరమైన సామగ్రి అందించాను’ అని అప్పుకుట్టి చెప్పుకొచ్చాడు.

ఇకపై ఏడాదికోసారి..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుకుట్టి కోరాడు. అప్పుడే సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. మనం ఊరి బయట ఉన్నా, ఏడాదికి కొన్ని రోజులు ఊరిలోనే నివాసం ఉండాలని, సొంతూరికి మన వంతు సాయం చేయలని అప్పుకుట్టి తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులో అప్పుకుట్టికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అజిత్, శింబు సినిమాల్లో ఎక్కువగా కమెడియన్ గా కనిపించే ఆయన గతంలో హీరోగానూ నటించారు. అళ్ గర్ సామియిన్ కుదిరై అనే సినిమాలో తన అభినయానికి గానూ ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ కూడా అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

విజయ్ సేతుపతితో కమెడియన్ అప్పుకుట్టి..

స్టార్ హీరో అజిత్ తో సరదాగా అప్పు కుట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు