కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు పొలిటికల్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఏపీ సీఎం జగన్‌ను బాగా అభిమానించే అతను 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున కుప్పంలో ఎమ్మెల్యేగా పోటీచేయనున్నారనే వార్తలు తెగ హల్‌చల్ చేశాయి. అయితే అవన్నీ వదంతులేనని ఖండించాడు. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన సమయంలో ఉప ఎన్నికల్లో బరిలోకి దిగారు. అయితే నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. అప్పటి నుంచే ఆయన పొలిటికల్ ఎంట్రీపై తరచూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా దిగ్గజ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఫొటోను గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఎలాంటి సందర్భం లేకుండా విశాల్ తన ఛాతీపై ఎంజీఆర్ టాటూను వేయించుకోవడం కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
కాగా తాను ఎంజీఆర్‌కు అభిమాని అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు విశాల్. రాబోయే ఎన్నికల్లో అతను అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, అందుకే ఆయన ఆ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏదైనా సినిమాలోని పాత్ర కోసం అలా ప్రయత్నించారేమోనంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది సామాన్యుడు, లాఠీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్. అయితే ఈ చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం అతను మార్క్ ఆంటోని అనే సినిమాలో నటిస్తున్నారు. రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పాటు డిటెక్టివ్ 2 సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు విశాల్. దీనికి అతనే దర్శకత్వం వహించనున్నారు.
*புரட்சி தலைவர் எம். ஜி.ஆர் படத்தை தன் நெஞ்சில் பச்சைகுத்தி இருக்கும் நடிகர் விஷால் அவர்கள்* #Vishal @VishalKOfficial @HariKr_official @VffVishal #MGR pic.twitter.com/AmmqIsook5
— Nikil Murukan (@onlynikil) January 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..