
శ్రీలంక అంతర్యుద్ధం ఆధారంగా రూపొందిన చిత్రం ‘నీలిర’. ఈ సినిమా ట్రైలర్ రిలీజే ఈవెంట్ కు ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన చిత్ర పరిశ్రమలో విద్వేషపూరిత చిత్రాలు పెరుగుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశాయి. వెట్రిమారన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి . ఆయన నేరు గా ప్రస్తావించకపోయినా ఆదిత్య ధర్, రణవీర్ సింగ్‌ల చిత్రం ‘ధురందర్ 2’ను లక్ష్యంగా చేసుకునే ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు . ‘మనం మన కథలను చెప్పుకునేంత వరకు, మన శత్రువులు చెప్పిందే మన జీవితం. మన సొంత కథలను చెప్పుకోవడానికి మనకు ప్రజాస్వామ్యం లేదు. ఈ చిత్రం ద్వేషాన్ని ప్రొత్సహించదు. హింసను సమర్థించదు. రూ. వందల కోట్లు సంపాదించాలనే ఆశతో కొంతమంది హింసను ప్రేరేపించేలా సినిమాలను నిర్మిస్తున్నారు. కానీ ఈ చిత్రం (నీలిర) ఒక జాతిని, ఒక మతాన్ని కానీ అపహాస్యం చేసేలా తెరకెక్కలేదు’ . ఈ రోజుల్లో ప్రతీది ఒక ప్రచారంగా మారిపోయింది. మన జ్ఞాపకాలను, ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఈ ప్రచారానికి ఉంది. నోట్ల రద్దు వల్ల ఎవరు నష్టపోయారో, క్యూ లైన్లలో నిలబడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ మరుగున పడేసి, ద్వేషాన్ని పెంచేలా ప్రచారం చేస్తున్నారు. అది సినిమానే కాదు. చరిత్రను లేదా వాస్తవాలను వక్రీకరించి చూపడం ‘హేట్ ప్రొపగండా’కిందకే వస్తుంది’ అని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు.
కాగా ‘ధురందర్ 2’ సినిమా ఉగ్రవాదాన్ని నివారించడానికి, నకిలీ నోట్ల వ్యాప్తిని అరికట్టడానికి ఒక మార్గంగా నోట్ల రద్దును చూపించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది దీనిని సమర్థిస్తుంటే మరికొందరు తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధురందర్ 2 సినిమా గురించి వెట్రిమారన్ మాట్లాడారని తెలుస్తోంది.
ఇక ‘నీలిర’ సినిమా గురించి మాట్లాడిన వెట్రి మారన్.. ‘ ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ శ్రీలంక అంతర్యుద్ధం కథను ఎంచుకున్న ‘నీలిర’ బృందాన్ని ఆయన ప్రశంసించారు. తెలుగు రాష్ట్రానికి చెందినవారైనప్పటికీ, ఇంతటి కథకు అండగా నిలిచిన నటుడు రానా దగ్గుబాటి మద్దతును కూడా ఆయన బహిరంగంగా కొనియాడారు.
#Vetrimaaran indirectly attacks #Dhurandhar2:
“Today everything becomes propoganda. Propoganda has power to influence memory. We all know who has impacted with demonetization & how many Lost lives in standing the queue. It’s hate propoganda”pic.twitter.com/kdQgYobUCN
— AmuthaBharathi (@CinemaWithAB) March 28, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.