శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూన్న నాని సినిమా.. శ్యామ్‌ సింగరాయ్ కోసం భారీ సెట్

నాచురల్ స్టార్ నాని.. టక్‌ జగదీష్ సినిమాలోని ఇంకోసారి పాటతో యూట్యూబ్‌లో సదండి మొదలెట్టాడో లేదో.. అప్పుడే ఇంకో సినిమా అప్‌ డేట్తో సోషల్ మీడియాలోకి వచ్చేశాడు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూన్న నాని సినిమా.. శ్యామ్‌ సింగరాయ్ కోసం భారీ సెట్

Edited By:

Updated on: Apr 19, 2021 | 8:36 AM

నాచురల్ స్టార్ నాని.. టక్‌ జగదీష్ సినిమాలోని  పాటలతో యూట్యూబ్‌లో సదండి మొదలెట్టాడో లేదో.. అప్పుడే ఇంకో సినిమా అప్‌ డేట్తో సోషల్ మీడియాలోకి వచ్చేశాడు. టక్‌ జగదీష్ తో పాటు.. రాహుల్ సంక్రీత్యన్‌ డైరెక్షన్లో ‘శ్యామ్‌ సింగరాయ్’‌ సినిమాలో నటిస్తున్న నాని  సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో నడవనుందట. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాదులోనే జరుగుతోంది.

నాని సరసన సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్, కృతి శెట్టి నటిస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ చిత్రం నాని కెరీర్ లోనే హై బడ్జెట్ మూవీ అని చెప్పాలి. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  రూ.6.5 కోట్ల వ్యయంతో నిర్మించిన కోల్ కతా సెట్ లో జరుగుతుంది. ఇదే చివరి షెడ్యూల్. 10 ఎకరాల్లో అవినాశ్ కొల్లా రూపొందించిన ఈ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RIP Vivek: మరో నవ్వుల రారాజును కోల్పోయిన వెండితెర.. 35 ఏళ్లకు పైగా సినిమానే జీవితంగా బ్రతికిన కామెడీ కింగ్

Venkatesh Drishyam 2: తెలుగు దృశ్యంను కూడా డిజిట‌ల్ స్క్రీన్‌పైనే చూపించనున్నారా.? ఓకే చెప్పేసిన నిర్మాత‌, హీరో.. ‌

Megastar Chiranjeevi: చిరు సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్.. నో చెప్పిన అనురాగ్ కశ్యప్..