AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : రూ.90 కోట్ల బడ్జెట్.. రూ.800 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్‏ను వణికించిన సినిమా.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..

దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే 800 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన సినిమా గురించి మీకు తెలుసా.. ? ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఆ చిత్రానికి ఉన్న క్రేజ్ తగ్గడం లేదు. ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.

Cinema : రూ.90 కోట్ల బడ్జెట్.. రూ.800 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్‏ను వణికించిన సినిమా.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..
Chhaavaa
Rajitha Chanti
|

Updated on: May 13, 2026 | 7:17 AM

Share

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగిపోయింది. స్టార్ హీరోహీరోయిన్స్, భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నటీనటులు కొత్తవారైనా సరే కథనం ఆసక్తికరంగా ఉంటే సినిమా కచ్చితంగా హిట్టవుతుందని నిరూపించే అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రికార్డులు తిరగరాసిన సినిమా గురించి మీకు తెలుసా.. ? తన బడ్జెట్ కంటే చాలా రెట్లు ఎక్కువ వసూలు చేసింది. కేవలం రూ.90 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా థియేటర్లలో ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ఛావా. బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బీటౌన్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. గతేడాది ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెమ్మదిగా భారీ విజయాన్ని సాధించింది.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. మేటాగ్ ఫిల్స్మ్ నిర్మించింది. కేవలం విడుదలైన 37 రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ.775 కోట్లు వసూలు చేసింది. ఛావా చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. శివాజీ సావంత్ రచించిన ఛావా అనే మరాఠీ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఛావ అంటే సింహపు పిల్ల అని అర్థం. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటన అద్భుతమనే చెప్పాలి. మొఘలులకు వ్యతిరేకంగా మరాఠా రాజు చేసిన పోరాటాన్ని, చివరకు అతడిని దారుణంగా చంపడాన్ని చూపిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

కేవలం రూ.90 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తే.. దాదాపు రూ.800 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us