
బాక్సాఫీస్ వద్ద ఏ కంటెంట్ చిత్రాలు హిట్టవుతాయి.. ఏ సినిమాలు డిజాస్టర్ అవుతాయనేది కేవలం ప్రేక్షకులు మాత్రమే నిర్ణయిస్తారు. ఇటీవల కాలంలో ఎలాంటి హడావిడి, ప్రచారం లేకుండా విడుదలైన చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కొన్నిసార్లు భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా పరిశ్రమలో మనుగడ సాగించాలంటే నటులు హిట్ సినిమాలు అందించాలి. అలాగే ఫెయిల్యూర్స్ సైతం తీసుకోవాలి. మలయాళ నటుడు టోవినో థామస్ విషయంలో కూడా ఇదే జరిగింది. మలయాళ పరిశ్రమలో అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. మలయాళీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోలలో టోవినో థామస్ ఒకరు. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదు సినిమాల్లో నటించాడు.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
లోకా చాప్టర్ 1: చంద్ర, L2: ఎంపురాన్, 2018: ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో చిత్రాల్లో నటించారు. లోకా చాప్టర్ 1: చంద్ర, L2: ఎంపురాన్ చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించారు. ఇప్పటివరకు టోవినో నటించిన అతిపెద్ద సోలో హిట్ చిత్రం అజయంతే రండమ్ మోషన్ (ARM, 2024). ఈ చిత్రానికి జితిన్ లాల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ టోవినో థామస్ నటించిన ఓ సినిమా మాత్రం బడ్జెట్ లో సగం కూడా రాబట్టలేకపోయింది. అదే ఐడెంటిటీ. ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో అఖిల్ పాల్, అనాస్ ఖాన్ నటించారు. అలాగే, త్రిష కృష్ణన్ ఏడు సంవత్సరాల విరామం తర్వాత మలయాళ సినిమాలో కనిపించింది. ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కేరళలో కేవలం రూ.3.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. . ఇండస్ట్రీ ట్రాకర్ సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం.. టోవినో, త్రిష నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 16.51 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కానీ ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..