మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీ.. సినిమాలు వదిలేసి గూగుల్‏లో జాబ్.. ఇప్పుడు టాప్ కంపెనీకి CEOగా..

90's యూత్ ఫేవరేట్ హీరోయిన్ ఆమె. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు IIT రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమా వదిలేసి కార్పొరేట్ రంగంవైపు అడుగులు వేసింది. ఇప్పుడు ఓ కంపెనీ సీఈవోగా వర్క్ చేస్తుంది.

మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీ.. సినిమాలు వదిలేసి గూగుల్‏లో జాబ్.. ఇప్పుడు టాప్ కంపెనీకి CEOగా..
Mahesh Babu

Updated on: Aug 28, 2025 | 3:00 PM

నటన పై ఆసక్తితో ఇతర రంగాల్లో ఉన్నత స్థానాలను వదులుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారలు చాలా మంది ఉన్నారు. మరికొందరు మాత్రం సినిమాల్లో గుర్తింపు వచ్చిన తర్వాత తమకు నచ్చిన రంగంలోకి వెళ్లిపోయారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. 90లలో ఆమె టాప్ హీరోయిన్. అందం, అభినయంతో ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. కానీ ఒక్కసారిగా సినీరంగాన్ని వదిలి కార్పొరేట్ ప్రపంచంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఐటీ రంగాన్ని ఏలుతున్న ఏకైక హీరోయిన్ ఆమె. ఆ హీరోయిన్ పేరు మయూరి కాంగో. ఆమె అద్భుతమైన లుక్స్, యాక్టింగ్ అప్పట్లో జనాలను ఫిదా చేశాయి. మయూరి కాంగో ఔరంగాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లి థియేటర్ ఆర్టిస్ట్, తండ్రి రాజకీయ నాయకుడు.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్.. 

ఇవి కూడా చదవండి

IIT ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలై IIT కాన్పూర్‌లో అడ్మిషన్ కూడా పొందింది మయూరి. కానీ సినిమాల్లో నటించేందుకు ఆ అడ్మిషన్ వదిలేసుకుంది. ఆ తర్వాత 1995లో దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా తెరకెక్కించిన నసీమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పాపా కెహతే హైన్ (1996) , బేతాబి (1997), హోగీ ప్యార్ కి జీత్ (1999), బాదల్ (2000) వంటి చిత్రాల్లో నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 2000లో వంశీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 2003 లో ఆదిత్య ధిల్లాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినీరంగానికి దూరమైంది. మయూరి కాంగో న్యూయార్క్ నగరంలోని బరూచ్ కాలేజీలో మార్కెటింగ్, ఫైనాన్స్‌లో MBA డిగ్రీని పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..

ఆ తర్వాత 2007లో US-ఆధారిత ప్రకటనల సంస్థ 360iలో అసోసియేట్ మీడియా మేనేజర్‌గా తన కార్పొరేట్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె డిజిటాస్‌లోని రిజల్యూషన్ మీడియాలో సీనియర్, తర్వాత 2012లో భారతదేశానికి తిరిగి వచ్చి జెనిత్‌లో చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా వర్క్ చేశారు. 2019లో గూగుల్‌లో ఇండస్ట్రీ – ఏజెన్సీ పార్టనర్‌షిప్ హెడ్‌గా చేరారు. ఆగస్టు 2024 నుండి ఆగస్టు 2025 వరకు, ఆమె AI, మార్టెక్ , మీడియా సొల్యూషన్స్‌కు ఇండస్ట్రీ హెడ్‌గా పనిచేశారు. ఆగస్టు 26 గూగుల్‌ను విడిచిపెట్టి ఆమె ఫ్రెంచ్ బహుళజాతి ప్రకటనలు మరియు ప్రజా సంబంధాల సంస్థ అయిన పబ్లిసిస్ గ్రూప్‌ CEOగా ఎంపికయ్యారు.

Mayoori Kango

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..