
భారతీయ సినీపరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. తెలుగు, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె.. ఇప్పుడు సన్యాసిగా మారి ఆధ్యాత్మిక జీవితం గడుపుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే గ్రేసీ సింగ్.. ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ 90వ దశకం సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్లలో ఆమె ఒకరు. గ్రేసీ సింగ్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.
ఆ తర్వాత అజయ్ దేవగన్, సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. 1997లో అమానత్ సీరియల్ ద్వారా నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేశారు. లగాన్ సినిమాతో 2001లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించగా.. అమీర్ ఖాన్ హీరోగా నటించారు. మదర్ ఇండియా, సలాం బాంబే సినిమాల తర్వాత లగాన్ చిత్రం విదేశీ భాషా విభాగంలో అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన మూడవ సినిమాగా నిలిచింది. 47వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో అత్యధిక అవార్డులు పొందిన చిత్రంగా నిలిచింది.
అక్కినేని నాగార్జున నటించిన సంతోషం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. కానీ గ్రేసీ సింగ్ నటించిన చిత్రాలు భారీగా విజయం సాధించలేదు. దీంతో ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. 2013లో, గ్రేసీ బ్రహ్మ కుమారిస్ వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీలో చేరింది. ఆ తర్వాత వారి నియమాలు నచ్చి వారి కార్యక్రమాల్లో పాల్గనడం స్టార్ట్ చేసింది.
చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న గ్రేసీ సింగ్ 2020లో సంతోషి మా.. సునయేన్ వ్రత్ కథయేన్ సీరియల్ ద్వారా బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తర్వాత ఆమె మళ్లీ నటించలేదు. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తుంది.
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..