Johnny Lever: 13 ఏళ్లకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇప్పుడు స్టార్ హీరోలకు మించిన ఆస్తులు..

చిన్నప్పుడే ఎన్నో కష్టాలు.. పేదరికంలోనే బాల్యం గడిచిపోయింది. కానీ ఆత్మవిశ్వాసంతో ప్రతి సవాలను స్వీకరించారు. ఏపీకి చెందిన ఒక సాధారణ వ్యక్తి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పాడు. ఇప్పుడు స్టార్ హీరోలకు మించిన ఆస్తులు ఉన్నాయి. ఇంతకీ ఈ టాప్ కమెడియన్ గురించి తెలుసా.. ? ప్రస్తుతం అతడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హాస్య నటుడు.

Johnny Lever: 13 ఏళ్లకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇప్పుడు స్టార్ హీరోలకు మించిన ఆస్తులు..
Johnny Lever

Updated on: Aug 14, 2025 | 3:03 PM

పేదరికంలోనే బాల్యం గడిపిన ఓ సాధారణ వ్యక్తి. చిన్న వయసులోనే వివిధ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు అతడు 300 కోట్లకు పైగా ఆస్తులతో స్టార్ హీరోలను మించిపోయాడు. అతడు మరెవరో కాదు.. జానీ లివర్. ఈరోజు (ఆగస్ట్ 14న) అతడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రతి పైసా కోసం కష్టపడ్డ జానీ లివర్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తులకు యజమాని.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇవి కూడా చదవండి

చిన్పప్పుడే కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడడంతో ఏడవ తరగతి వరకు చదివి మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత డబ్బుల కోసం చిన్న చిన్న పనులు చేశాడు. పాన్ అమ్మడం, పెన్నులు అమ్మడం చేసేవారు. అలా రోజుకు రూ.5 వరకు సంపాదించేవాడు. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. నివేదికల ప్రకారం ఆయన ఆస్తులు రూ.300 కోట్లు. జానీ లివర్ సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, మిమిక్రీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. అతను సంవత్సరానికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

అలాగే ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని లోఖండ్‌వాలాలో ఒక విలాసవంతమైన 3BHK అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఇదే కాకుండా ముంబైలో అతడికి మరికొన్ని ఫ్లాట్స్, అందమైన విల్లా ఉన్నాయి. అలాగే అతడి వద్ద ఆడి Q7, హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. 1984లో సుజాతను వివాహం చేసుకున్నారు జానీ లివర్. వీరికి బాబు, పాప జన్మించారు.ప్రస్తుతం జానీ లివర్ కొడుకు సినిమాల్లో హాస్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..