Actress : ఈ హీరోయిన్ ఏంట్రా బాబు ఇలా మారిపోయింది.. 17 ఏళ్లకే పెళ్లి, విడాకులు.. ఇప్పుడు స్టార్ హీరో భార్య..

దక్షిణాదిలో అందంతో కట్టిపడేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం సౌత్ సినీప్రియుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ముద్దుగుమ్మ. రాజ వంశానికి చెందిన అమ్మాయి. కానీ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. 17 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. తక్కువ వెంటనే విడాకులు తీసుకుంది.

Actress : ఈ హీరోయిన్ ఏంట్రా బాబు ఇలా మారిపోయింది.. 17 ఏళ్లకే పెళ్లి, విడాకులు.. ఇప్పుడు స్టార్ హీరో భార్య..
Aditi Rao Hydari

Updated on: Dec 10, 2025 | 5:24 PM

అందంలో ఆమె అప్సరస. తెలుగు, తమిళం, హిందీ భాషలలో తనదైన ముద్ర వేసింది. నటనతోపాటు అందంలోనూ కట్టి పడేసింది. తక్కువ సినిమాలే చేసినప్పటికీ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపించింది. ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నం సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయాయి. రాజవంశానికి చెందిన ఈ అమ్మాయి నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ అదితి రావు హైదరీ. ఆమె తాత 1896 నుంచి 1941హైదరాబాద్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. వనపర్తి రాజ కుటుంబానికి వారసురాలు ఆమె. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 17 ఏళ్ల వయసులోనే సత్యదీప్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..

ఆ తర్వాత చాలా కాలం ఒంటరిగా ఉన్నా అదితి రావు హైదరీ.. ఇప్పుడు కొత్తగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. సౌత్ హీరో సిద్దార్థ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి తెలుగులో మహాసముద్రం సినిమాలో నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. 2006లో ప్రజాపతి సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన అదితి.. ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురుచూచ్తుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..

అదితి తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో నటించింది. హిందీలో ఢిల్లీ 6 సినిమాతో నటిగా పరిచయమైన ఆమె.. ఆ తర్వాత 2018లో విడుదలైన పద్మావత్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదితి షేర్ చేసిన ఫోటోస్ వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..