AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏం టాలెంట్ అమ్మడు.. అటు బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇటు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..

కెరీర్ ప్రారంభంలో డాక్టర్స్, ఐఏఎస్ కావాలని ఎన్నో కలలు కంటారు చాలా మంది. కానీ అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోహీరోయిన్లుగా మారిపోతుంటారు. కానీ కొందరు ఇటు ఇండస్ట్రీలో ఫేమస్ అయినప్పటికీ అటు తమకు నచ్చిన రంగంలోనూ రాణిస్తుంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది.

Tollywood: ఏం టాలెంట్ అమ్మడు.. అటు బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇటు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
Nivetha
Rajitha Chanti
|

Updated on: Jan 27, 2025 | 8:42 PM

Share

సినీరంగంలో స్టార్ హీరోహీరోయిన్లుగా మారిపోయిన చాలా మంది.. ఇప్పుడు తమకు నచ్చిన రంగంలోనూ రాణిస్తున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా .. ? టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సొంతం చేసుకుంది. అయితే ఈ అమ్మడు డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకోలేదు.. ఏకంగా ఫార్ములా కార్ రేసింగ్ లో రయ్ రయ్ మని దూసుకెళ్లాలనుకుంది. అందుకు తగిన శిక్షణ సైతం తీసుకుంది. ఇప్పటికే పలు పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. కేవలం రేసింగులోనే కాకుండా బ్యాడ్మింటన్ పోటీల్లోనూ పాల్గొంది. అయితే అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్ అయ్యింది. తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్.

తమిళనాడులోని మధురైలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి పదేళ్లు దుబాయిలో ఉన్నత చదువులు చదివింది. ఆ తర్వాత మిస్ ఇండియా యూఏఈ పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లోనూ పాల్గొంది. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత టిక్ టిక్ టిక్, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురంలో, రెడ్, పాగల్, దాస్ కా దమ్కీ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మ స్టార్ డమ్ మాత్రం రాలేదు.

ఓవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు తన తమ్ముడితో కలిసి ఫార్ములా కారు రేసింగ్ పోటీల్లో పాల్గొంది. అలాగే బ్యాడ్మింటన్ పోటీల్లోనూ తనదైన ప్రతిభను చూపిస్తూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది నివేదా. గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా యాక్టివ్ లేదు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..