Actor : సీరియల్స్‏లో సపోర్టింగ్ రోల్స్ చేసి.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరో.. ఏకంగా 1600 కోట్ల రూపాయల సినిమాలో..

ఒకప్పుడు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి పలు చిత్రాల్లో నటించాడు. కానీ ఇప్పుడు టాప్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 1600 కోట్ల బడ్జెట్‏తో రూపొందిస్తున్న చిత్రంలో భాగం కానున్నారు.

Actor : సీరియల్స్‏లో సపోర్టింగ్ రోల్స్ చేసి.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరో.. ఏకంగా 1600 కోట్ల రూపాయల సినిమాలో..
Vikranth Massey

Updated on: Jul 11, 2025 | 9:18 PM

టెలివిజన్ ద్వారా సినీప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాల్లో టాప్ హీరోలుగా రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ప్రాచిదేశాయ్ వంటి స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు సైతం ఒకరు. ఒకప్పుడు టీవీ సీరియల్స్ సైడ్ రోల్స్ పోషించారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్నారు. తనదైన నటనతో ఇప్పుడు సినీరంగంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. అతడు నటించిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు 1600 కోట్లతో రూపొందిస్తున్న ఓ భారీ బడ్జెట్ మూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అతడు మరెవరో కాదు.. విక్రాంత్ మాస్సే. 12th ఫెయిల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ప్రస్తుతం హిందీలో రూపొందిస్తున్న రామాయణ సినిమాలో విక్రాంత్ మాస్సేను ఎంపిక చేసినట్లుగా సమాచారం. డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, సన్నీ డియోల్, యష్ ప్రధాన పాత్రుల పోషిస్తున్ారు. అయితే ఈ చిత్రంలో మేఘనద (ఇంద్రజిత్) పాత్రను పోషించడానికి విక్రాంత్ మాస్సేను ఎంపిక చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. రామాయణం బడ్జెట్ రూ. 1600 కోట్లు, ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, సాయి పల్లవి మా సీత పాత్రలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విక్రాంత్ మాస్సే కెరీర్ విషయానికి వస్తే.. ‘ధూమ్ మచావో ధూమ్’ అనే టీవీ షోతో సినీప్రయాణం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ధరమ్ వీర్‌లో రజత్ టోకాస్‌తో కలిసి నటించాడు. తర్వాత బాలిక వధు (చిన్నారి పెళ్లి కూతురు) సినిమాలో శ్యామ్ పాత్రలో నటించారు. 2013లో లూటేరా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత 12th ఫెయిల్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..