Tollywood : జర్నలిజం నుంచి సినిమాల్లోకి.. బోల్డ్ సీన్లతోనే ఫేమస్.. ఇప్పుడేమో అలా..

జర్నలిజం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టింది. నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఆమెకు ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. ఈ బ్యూటీ ఎక్కువగా బోల్డ్ సీన్ చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood : జర్నలిజం నుంచి సినిమాల్లోకి.. బోల్డ్ సీన్లతోనే ఫేమస్.. ఇప్పుడేమో అలా..
Shraddha Das

Updated on: Mar 04, 2025 | 8:40 AM

సినీరంగంలోకి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలా మంది వస్తుంటారు. అయితే అందరూ విజయం సాధించలేరు. కొంతమంది మొదటి సినిమాతోనే పాపులర్ అవుతుంటారు. మరికొందరు మాత్రం వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ స్టార్ స్టేటస్ అందుకోలేరు. అందుకే కొందరి కలలు కలలుగానే మిగిలిపోతాయి. నటనను కొనసాగించేందుకు జర్నలిజం కెరీర్ వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ హీరోయిన్. కానీ ఆమె సరైన బ్రేక్ అందుకోలేకపోయింది. అలాగే సినిమాల్లో గ్లామర్, బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. అయినా స్టార్ట్ స్టేటస్ మాత్రం రాలేదు. కానీ ఒకరోజు ఆమె ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ గురించి ఒక వ్యాఖ్య చేయడంతో అక్కడ తీవ్ర దుమారం చెలరేగింది. ఈ ఒక్క సంఘటన కారణంగా ఆమె పాపులర్ అయ్యింది. ఆమె మరెవరో కాదు. హీరయిన్ శ్రద్ధా దాస్.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తన కెరీర్‌లో దాదాపు 40 చిత్రాల్లో నటించింది. తన కెరీర్‌లో దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆమె ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘దిల్ తో బచ్చా హై జీ’, ‘ఆర్య 2’, ‘సనమ్ తేరీ కసమ్’, లాహోర్ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించింది. మార్చి 4న శ్రద్ధా తన 38వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ముంబైలో జన్మించి బెంగాలీ కుటుంబంలో పెరిగింది. ముంబై విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో పట్టా పొందిన తరువాత, ఆమె తన సినీ ప్రయాణాన్ని తెలుగు చిత్రం ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’తో ప్రారంభించింది. ‘లాహోర్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

కొంతకాలం క్రితం సోను నిగమ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆజాన్ గురించి వివాదాస్పద ప్రకటన చేశారు. సోను నిగమ్ చేసిన ఈ ట్వీట్ తర్వాత అతను చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. సోను నిగమ్ ట్వీట్‌పై ఆమె స్పందిస్తూ, ‘నా ఇంట్లో అజాన్ అంతగా వినబడదు. ఈ ధ్వనితో నాకు ఎప్పుడూ సమస్య రాలేదు. నేను సోను నిగమ్ ఇంటికి దగ్గర్లోనే నివసిస్తున్నాను, కానీ విచిత్రం ఏమిటంటే నా ఇంట్లో నేను ఎప్పుడూ అజాన్ శబ్దం వినలేదు” అంటూ పోస్ట్ చేసింది. శ్రద్ధా దాస్ ఈ పోస్ట్ రాసిన వెంటనే తన సోషల్ మీడియా ఖాతా నుండి దాన్ని తొలగించింది. కానీ ఈ పోస్ట్ చాలా దుమారం రేపింది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..